-
-
ఒక జీవితం... కొన్ని కలలూ...!
Oka Jeevitam Konni Kalalu
Author: Akunuri Haasan
Publisher: Tenali Prachuranalu
Pages: 191Language: Telugu
ఈ కథలు చాలా చోట్ల సూటిగా తాకుతాయి..
డబ్బు, కీర్తి లాంటి సారరహిత విలువల్తో ఎండిపోతున్న ప్రపంచాన్ని కాసింత మృదువుగా మార్చే ప్రయత్నం నాకు చాలా సంతోషాన్నిచ్చింది.
ఈ కథల ద్వారా మనం పొందే ప్రతి అనుభూతికీ వేదిక....విలక్షణ వాతావరణంలో ముంచి తీసిన పాత్రల రక్తమాంసాలు, మానసిక ఘర్షణలే తప్ప రచయిత కంఠస్వరం కాకపోవడం ఈ కథల సువాసన.
ఈ కథల నిండా పరుచుకున్న స్త్రీ... మగవాళ్ళకు ఓ మహాప్రశ్నయే ఎప్పటికీ.! అప్సరసగా ఉన్నప్పుడూ, ఆడజంతువుగా వున్నప్పుడు కూడా.
మనీషిలోని ఆదిమస్పర్శ మొదటిపేజీ నుంచి చివరిదాకా మనల్ని తాకుతూనే ఉంటుంది. వొక తడుములాట...వొక ఎదురుచూపు...వొక ఆలోచనల చౌరస్తా...
బాపట్లలోనే తన ఊపిరినంతా దాచేసిన ఈ రచయిత... తృప్తి నివ్వలేని వెర్బల్ జవాబులన్నీ కొట్టుకుపోతున్న సుడిగాలిలో ఏకాంతం నించి సమూహంలోకి, సమూహం నించి ఏకాంతంలోకి చేసిన పచార్లు ఈ కథలు.
ఈ అక్షరాల్ని తాకండి. ఓ మానవానుభవం తన అన్ని కోణాల్తో మిమ్మల్ని కౌగిలించుకుంటుంది. అలా...అలా... సుదూర నిర్లిప్త తీరానికి నడిపిస్తుంది.
- ఆకునూరి హాసన్
