-
-
ఒక జీవికి స్వేచ్ఛ
Oka Jeeviki Swechcha
Author: K. Ramalakshmi
Publisher: Stree Shakti Prachuranalu
Pages: 370Language: Telugu
శ్రీమతి కె. రామలక్ష్మి 1950కి ముందునుంచీ కథలు రాస్తున్నారు. విమర్శకులు మంచికథకు నాలుగు లక్షణాలను - క్లుప్తత, అనుభూతి, ఐక్యత, సంఘర్షణ, నిర్మాణసౌష్ఠవం అనే వాటిని పేర్కొంటారు. రామలక్ష్మి కథలు క్లుప్తమైనవి. ఒక్కసారిగా చదివి ముగించటానికి వీలైనవి. తీరైన నిర్మాణసౌష్ఠవం చాలా కథల్లో కన్పిస్తుంది.
రామలక్ష్మి కథల్లో భాష, శైలి రెండూ ఆధునికమైనవి. ఎక్కడా అసహజత్వానికి చోటీయనివి. కథల్లో వాదోపవాదాలు శిల్పమర్యాదకు భంగం కలిగించనవి. సాధారణంగా కన్పించే అసాధారణమైన కథలివి.
ఈ కథలు వినోదం కోసం ఉల్లాసం కోసం రాసినవి కావు. తన అనుభవంలోకి వచ్చిన విషయాలను తక్కువ కల్పనను జోడించి తనదైన రీతిలో చెప్పిన కథలివి.
రామలక్ష్మిగారి కథలలో ఆధునిక జీవితంలో మనుషుల మధ్య ప్రేమానుబంధాలు తరిగిపోతున్నాయన్న ఆవేదన వుంది. చదువూ సంస్కారంతో మనుషులు సమస్యల్ని పరిష్కరించుకోవాలేగాని ఆత్మహత్యలు ప్రత్యామ్నాయం కాదన్న ఉద్బోధ అంతర్లీనంగా వుంది.
ఆధునిక జీవితాన్ని అర్థం చేసుకోదలచినవారు రామలక్ష్మిగారి కథలు తప్పక చదవాలి.
- డా. కడియాల రామమోహనరాయ్
