-
-
ఒక హిజ్రా ఆత్మకథ
Oka Hijra Atmakatha
Author: A. Revathi
Publisher: Hyderabad Book Trust
Pages: 155Language: Telugu
మనం హక్కుల గురించి తరచు గట్టిగా మాట్లాడుతూ వుంటాం. అయితే సమాజపు అంచులలో బతికేవారికి ఈ హక్కులు అందుబాటులో వున్నాయా? కులమూ, మతమూ, లింగమూ, లైంగికతల పేరుతో వ్యక్తులకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. వాళ్లు తమ హక్కుల విషయంలో రాజీ అయినా పడాలి లేదా పోరాడాలి. అట్లా హక్కులు నిరాకరించబడి సమాజపు అంచులకు నెట్టివేయబడ్డ ఒక వ్యక్తిని నేను. ఎందుకంటే పురుషుడిగా పుట్టి స్త్రీగా జీవించాలనుకున్నందుకు! నా జీవితంలో నిత్యమూ నేనెదుర్కున్న వివక్ష, హేళన, వేదనే కాక, నా సహనమూ నా సంతోషమూ కూడా మీ ముందు పరిచేదే ఈ పుస్తకం.
ఒక హిజ్రాగా నేను సమాజపు చివరి అంచులలోకి నెట్టబడ్డాను. అయినా నా జీవితాన్ని మీముందు పెట్టే సాహసం చేస్తున్నాను. ఒక హిజ్రాగా వుండమే కాదు, సెక్స్వర్క్ చెయ్యడం గురించి కూడా చెబుతున్నాను. ఎవరి మనోభావాలనూ నొప్పించడానికి గానీ ఎవరినీ నిందించడానికి కానీ నేనీ పుస్తకం రాయలేదు. హిజ్రాల జీవన విధానం గురించీ వారి ప్రత్యేక సంస్కృతి గురించీ, వారి కలలూ కోరికల గురించీ పాఠకులకు తెలియజెప్పడానికే రాస్తున్నాను.
నేను రాసిన 'ఉనర్వుమ్ ఉరువమమ్' తమిళనాడులో తెచ్చిన ఫలితాలను చూసి నేను గర్వపడుతున్నాను. ఇప్పుడు నా జీవిత చరిత్ర సమాజంలో మరిన్ని మంచి మార్పులు తేగలదని ఆశిస్తున్నాను. అడుక్కోడనికీ సెక్స్వర్క్ చెయ్యడానికే కాదు అనేక మంచిపనులు చేసే సామర్థ్యం హిజ్రాలకుందని ఈ పుస్తకం చదివి తెలుసుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను. నేను ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి సానుభూతి ఆశించడం లేదు. హిజ్రాలమైన మాకు సమాజంలో అందరిలాగా జీవించే హక్కు వుందని చెప్పాలనుకుంటున్నాను.
- రేవతి
