-
-
ఒక చిన్న అబద్దం
Oka Chinna Abaddam
Author: Anguluri Anjanidevi
Publisher: Charan Publications
Pages: 296Language: Telugu
మిథునకు మంజీర్ డ్రైవింగ్ అంటే ఇష్టం. అందుకే ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా, ఎక్కడి నుండి ఇంటికి రావాలన్నా అతనే కారు తీసుకొని వెళ్తుంటాడు. ఆమె కూడ మంజీర్తో 'మంజీర్! స్టీరింగ్ నీ చేతుల్లో వున్నంత సేపు నాకు నిశ్చింతగా వుంటుంది. ఇంట్లోకన్నా నేను కారులోనే ఎక్కువగా రిలాక్స్ అవుతాను' అని చాలాసార్లు చెప్పింది. ఆమె అభిప్రాయాన్ని భారతరత్నలా భావించాడు మంజీర్. అందుకేనేమో ఆమెపట్ల చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంటాడు. ఇవాళ ఢిల్లీలో వాతావరణం సహకరించకపోవడం వల్ల మిథున ఎక్కబోయే ఫ్లైట్ ఒకటిన్నర గంట ఆలస్యంగా టేకాఫ్ అవుతుందని తెలిసినా మంజీర్ విసుక్కోలేదు. ఆమెకోసం ఎదురుచూస్తూ పాటలు వింటూ కారులోనే కూర్చున్నాడు. చాలామంది డ్రైవర్లు అలా వుండరు.
రింగ్‌రోడ్డు ఒన్‌వే కాబట్టి ఓవర్‌టేక్‌లు వుండవు. 60 నుండి 80 కిలోమీటర్ల మధ్య వేగంతో కారును చాలా స్మూత్‌గా నడుపుతున్నాడు మంజీర్. అతని డ్రైవింగ్‌ను ఆమె ఎంత ఇష్టపడుతుందో ఆ కారును కూడా అంతే ఇష్టపడుతుంది. ఆ కారును కొని ఇంటికి తెచ్చుకున్న రోజు అయితే ఆ రాత్రంతా కారునే చూస్తూ బాల్కనీలో కూర్చుంది. చిన్నపిల్ల నీళ్లను చూసి సంబరపడినట్లు మధ్యమధ్యలో నిద్రలేచి వెళ్లి కారును తాకి సంతోషపడేది. ఇల్లు కూడ అంతే! ఆమెకు ఎలాంటి ఏరియా అయితే బావుంటుందో అక్కడే కొనుక్కుంది. ఆ ఇంటిని గాని, ఆ కారును గాని ఎవరు చూసినా 'ఇలాంటివి మనక్కూడా వుంటే బావుండు కదా! మిథున ఎంత లక్కీనో' అనుకుంటారు. కారు, ఇల్లే కాదు ఆమె జీవనశైలి కూడ భిన్నంగానే వుంటుంది. అసలు ఆమె తన కెరీర్‌ను మలచుకున్న విధానమే ఒక సంచలనం.
This book is ok. First half narration is good but second half narration seemed to be rushed and is not convincing.