• Oka Amma Akrosam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఒక అమ్మ ఆక్రోశం

  Oka Amma Akrosam

  Author:

  Pages: 94
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

చిన్న నవల అయినా చాలా బరువైన విషయాలపై మన దృష్టిని కేంద్రీకరించే మంచి పెద్ద కథ ఇది.

రేవతి, రవి, రఘు, మధు - తల్లి, తండ్రి, పెద్దకొడుకు, చిన్న కొడుకు - వీరు నలుగురు కలిసి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంగా ప్రత్యక్షమౌతారు మొదటి పేజీలోనే. పేజీలు తిరగేస్తున్నకొద్ది ఈ పాత్రలు మన మనోఫలకంలో చిత్రకారుడు చిత్రిస్తున్నట్లు రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటాయి. వీళ్ళందరూ మనలాంటి వాళ్లే అన్న అపోహ త్వరలోనే మాయమవుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి తల్లులు ఆందోళన పడరూ! అందులో విశేషం ఏముంది అంటారేమో.... చదవండి ముందు! అప్పుడు తల్లి రేవతి యొక్క చెప్పుకోలేని బాధ తెలుస్తుంది.

కుటుంబంలో ఏవొక్కరైనా మానసిక వ్యాధితో ఉంటే ఆ కుటుంబం యొక్క 'ఆవేదన, సంఘర్షణ, ఆర్థిక, సామాజిక సమస్యలు' అర్థం చేసుకోవటం అంత సులభం కాదు. ఆ లోటు తీరుస్తుంది ఈ నవల.

ఉమగారి చేతిలో, చక్కని సరళమైన భాషలో, ఈ కథ మనందరికి 'కనువిప్పు' కలిగిస్తుంది. మామూలు కథలులాగ ఒక ప్లాటు, క్లైమాక్సు, రకరకాల సంఘటనతో నిండిన రచన కాదు. అయినా చదవటం మొదలెట్టాక చివరిదాకా వెళ్ళందే ఆగలేం.

- పెమ్మరాజు వేణుగోపాలరావు

Preview download free pdf of this Telugu book is available at Oka Amma Akrosam