• Odyssy
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 324
    360
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఒడెస్సీ

    Odyssy

    Pages: 188
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పాశ్చాత్య వాఙ్మయానికి తలమానికమై, హోమర్‌ రచనలుగా విఖ్యాతి చెందిన ఇలియాడ్‌, ఒడెస్సీలు క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్ధికి చెందినవిగా విజ్ఞులు భావిస్తున్నారు.

ట్రోజన్‌ యుద్ధానంతరం పదేళ్లపాటు సాగిన ఒడెసిస్‌ తిరుగు ప్రయాణంలో జరిగిన సంఘటనల సమాహారం ఒడెస్సీ. ఒడెసిస్‌ మరణించాడని భావించిన ఇథాకా యువకులు అతని భార్య పెనెలోప్‌ను తమలో ఒక్కరిని వివాహమాడవలసిందని వేధిస్తూ ఆ యింటి మీద పడి తింటూ విందూ వినోదాలతో కాలక్షేపం చేస్తుంటారు. ఒడెసిస్‌ కుమారుడు టెలిమాఖస్‌ ఆనాటికి ఇరవై ఏళ్ల యువకుడవుతాడు. ఆతనికి ఈ ఇథాకా యువకుల చేష్టలు నచ్చవు.

ఒడెసిస్‌ తన ప్రయాణంలో పడ్డ కష్టాలు, ఆతడు ఇంటికి ఎలా తిరిగి వచ్చాడు, దారిలో ఎవరెవర్ని కలిసాడు - ఈ సంఘటనలన్నీ కలిసి ఒడెస్సి ఓ మహత్తరమైన కావ్యంగా రూపుదాల్చింది.

ఒడెస్సీలో వర్ణించిన గ్రహస్థితుల్ని అంచనా వేస్తూ మారెలొ-ఒ-మాగ్నాస్కొ, కాన్‌స్టాంటినో బైకొజిస్‌లు - ఇథాకాలో వీనస్‌ను ఒడెసిస్‌ గమనించడం, యువకుల్ని చంపే రోజు ముందురోజు నెలపొడుపు అగుపడడం, యువకుల్ని చంపేరోజు సూర్యగ్రహణం వలన మిట్టమధ్యాహ్నం చీకటి కమ్మడం - ఈ ఆధారాలతో ట్రాయ్‌ యుద్ధం క్రీస్తుపూర్వం 1188లో జరిగినట్లు (ఆర్కియాలజీ నిర్ధారణ - 1190 B.C.), ఒడెసిస్‌ ఇథాకాకు వచ్చినరోజు 16 ఏప్రియల్‌ 1178 B.C.గా నిర్ధారించినారు.

తెలుగు సాహితీ జగత్తుకు సృజనలోకం అందిస్తున్న మరో కానుక ఒడెస్సీ. రామాయణ, మహాభారతాలలో, పురాణాలలో మనం విన్న కథలకు గ్రీకు వాఙ్మయంలోని కథలకు పోలికలు ఉన్నట్లు అనిపిస్తే ఉలిక్కిపడనవసం లేదు. మన సాహిత్యానికి, గ్రీకు సాహిత్యానికి ఉన్న సారూప్య భేదాలు అవగతం కావడానికి గ్రీకు వాఙ్మయంలోని ఇలియాడ్‌, ఎపిక్‌సైకిల్‌, థియొగొని,వర్క్స్‌ అండ్‌ డేస్‌, ఎయినీడ్‌ లాంటి కావ్యాల్ని డాక్టర్‌ లంకా శివరామప్రసాద్‌ తెలుగు పాఠకులకు అందిస్తున్నారు.

Preview download free pdf of this Telugu book is available at Odyssy