-
-
ఓ నా మనసా వినవే...
O Na Manasa Vinave
Author: Inakota Ravikumar
Publisher: Kartika Pournami Prachuranlau
Pages: 24Language: Telugu
మనసు నిత్యజీవితంలో ఎన్నో సమస్యలకు ఎలా స్పందిస్తుందో నిర్ధుష్టంగా చెప్పలేం. సున్నితమైన మనసు చేసే 'మాయాజాలం' మనల్ని తోలుబొమ్మలాటలో పాత్రులుగా చేసి ఆడిస్తాడా అన్నట్లుగా వుంటుంది.
మనసు మాయ అనే పంజరంలో చిక్కి అదే స్వర్గమని భ్రాంతి చెందుతుంటుంది. ఊబిలో కూరుకొని ఇదే సంసార స్వర్గమని ఓలలాడుతుంటుంది. ఈ మనస్సే.... వ్యవహారాలకి మూలం. స్నేహానికి, శత్రుత్వానికి, బంధానికి, శాంతికి, క్రోధానికి, మోక్షానికి, ముక్తికి వీటన్నిటికి కారణమవుతుంది. మనసే వివిధ మనోవికారాలకి, వివిధ రకాల దుర్వ్యసనాలకి, దుర్వాసనలకి కారణభూతమవుతుంది. మన రాగద్వేషాలకి విడుదలయ్యే విషవ్యర్థాలకి కూడా మనసే మూలం.
మనస్సనేది సముద్రంలోని కెరటాలలా భవబంధాలలో చిక్కుకుని అల్లాడుతుంటుంది. మంచి చెడుల ఉయ్యాలలూగుతుంటుంది. మనసుని మంచివైపు అమ్మలా లాలించి ఆధ్యాత్మిక వైరాగ్యపు గొరుముద్దని ఓ మనసా వినవే ద్వారా మీ మదిలో నిక్షిప్తం చేయాలనే సదుద్దేశంతో విరచితమైనది.
మనసుని ఆధ్యాత్మిక జ్ఞానముతో ఉత్తేజపరచి, తట్టి లేపి, ఏది సత్యమో? ఏది ఆత్మజ్ఞానమో? ఏది ఆత్మపరిశీలనమో? ఏది చేయాలో ఏది విస్మరించాలో? 108 మార్మిక తత్వాల ద్వారా మీ ముందుకు వ్యాఖ్యానంతో కూడిన ఓ మనసా వినవే! అనే జ్ఞానతత్వాలని రచించడం జరిగింది.
- ఆర్కాటు. మురళీకృష్ట, ఐనకోట. రవి.
