-
-
ఓ మహిళా తిరగబడు... చూపించు తెగువ
O Mahila Tiragabadu Chupinchu Teguva
Author: Kekalathuri Krishnaiah
Pages: 112Language: Telugu
శ్రీ కేకలతూరి క్రిష్ణయ్య రచించిన ఈ గ్రంథం చదివాను. తల్లి పాదాల క్రింద స్వర్గం వుందని ఇస్లాం ధర్మం చెబుతోంది. ఒక మహిళను కాపాడిన వ్యక్తి స్వర్గానికి వెళతాడు. హింసించిన వ్యక్తి స్వర్గాన్ని చేజార్చుకుంటాడు. మహిళలను కాపాడే అవకాశం ఇటు పోలీసులకు, అటు రచయితలకు అధికంగా వుంటుందని నా ఉద్దేశం. రచయిత మహిళల పట్ల ప్రదర్శించిన సానుభూతి, ధైర్య వచనాలు, తన పుస్తకం ద్వారా మహిళలను కాపాడాలనే ఒక బలమైన ఆకాంక్ష, మహిళలకు చేతనైనంత సహాయ సహకారాలు అందించాలనే తపన, దృక్పథం, శోధన చక్కగా ఉన్నాయి. సమాజంలో మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు, అరాచకాలను, సమాజంలోని పోకడలను చాలా క్షుణ్ణంగా గమనించి, పరిశీలించి, పరిశోధించి ఈ పుస్తకం రాశారని అర్థం అవుతుంది. పరిష్కారాలు కూడా చూపించారు.
- శ్రీ ఎ.కె.ఖాన్ ఐ.పి.ఎస్, ఏసిబి డైరక్టర్ జనరల్
* * *
ఇది చాలా సాధికారిక రచన. ప్రపంచాన్ని పరిశోధించి, పరిశీలించి స్త్రీ పరిస్థితిని కళ్ళకు కట్టిన రచన. ఇటీవల స్త్రీల మీద దాడులు ఎక్కువయ్యాయి. నిర్భయ చట్టం వచ్చింది. వాటి గురించి వివరణ ఇచ్చారు. క్రమంగా స్త్రీలు ప్రపంచంలో, వివిధ రంగాల్లో ఎట్లా రాణించారో వివరించారు. స్త్రీలపై జరుగుతున్న దాడులకు ఎట్లాంటి సామాజిక, ఆర్థిక, మానసిక పరిస్థితులు దేశంలో వున్నాయో చూపారు. వీటన్నిటిని అధిగమించి స్త్రీ ధైర్యంగా, నిలబడడానికి ఎట్లాంటి చర్యలు అవసరమో సచిత్రంగా వివరించారు.
- శ్రీ తనికెళ్ళ భరణి, రచయిత, సినీ కళాకారులు

- ₹154.02
- ₹216
- ₹255
- ₹162
- ₹122.4
- ₹181.56