-
-
ఓ ఖైదీ వీరగాథ
O Khaidi Veeragatha
Author: V. Aswini Kumar
Pages: 40Language: Telugu
పందొమ్మిదవ శతాబ్ది చివరి దశాబ్దాలలో ఇంగ్లీషు సాహిత్యాకాశాన తళుక్కుమన్న తోకచుక్క ఆస్కార్ ఫింగల్ ఓఫ్లాహెర్టి విల్స్ వైల్డ్ (1856-1900). జననం ఐర్లండ్ రాజధాని డబ్లిన్లో. తల్లికి రచయిత్రిగా పేరుంది. ఆక్స్ఫర్డ్లో చదువుతున్నప్పుడు జాన్ రస్కిన్, వాల్టర్ పీటర్ కళాసిద్ధాంతాలతో ప్రభావితుడయ్యాడు వైల్డ్.
వైల్డ్ పలు వ్యాసాలు, నాటకాలు, కథలు, ఒక నవలతో తన అభిప్రాయాలను ప్రచారం చేశాడు. నైతికతకూ, కళకూ సంబంధం లేదన్నది ఈయన విశ్వాసం. కథకుడిగా, కవిగా వైల్డ్కు కొంత గుర్తింపు వచ్చినా, 1892 నుండే బ్రిటీష్ రంగస్థలం మీద సంచలనం సృష్టించిన నాటకాలు, ‘Lady Windermere’s Fan', ‘A woman of no importance’, ‘An ideal Hunsband’, ‘Importance of being Earnest’ లతో కీర్తీ, డబ్బూ లభించాయి.
* * *
1892లో లార్డ్ ఆల్ఫ్రెడ్ డగ్లస్తో వైల్డ్ స్నేహాన్ని అసహజంగా భావించిన యిరు పక్షాల హితైషులు వెంటనే ఈ సంబంధాన్ని తెంచుకోమని సూచించారు. అందుకు వైల్డ్ నిరాకరించడంతో కోర్టులో కేసు వేసి వైల్డ్ని జైలు పాలు చేశారు.
రీడింగ్ జైలులో వున్నప్పుడు ఆస్కార్ వైల్డ్తో పాటు అక్కడ ఉరి శిక్షకు సిద్ధమవుతున్న ఖైదీ తారపడతాడు. అతని వీరోచిత ప్రవర్తన ఆస్కార్ వైల్డ్ని ఆశ్చర్యపరుస్తుంది. 7-7-1896 నాడు, భార్యని హత్య చేశాడనే నేరానికి, ఒక ముప్ఫై ఏళ్ళ యువకుడిని ఉరి తీస్తారు. ఇది చూసి, చలించి పోయిన వైల్డ్ “Yet each man kills the thing he loves” అంటూ తన Ballad of Reading Gaol ను ప్రారంభించాడు.
ఉరికంబం ఎక్కబోతున్న వాది 'బాధను' - ఉరి తీసే వారి ఘాతుకాన్ని - చట్టాల లొసుగులకు తెలియజేస్తూ తనదైన శైలిలో The Ballad of Reading Gaol రాశాడు.
