-
-
ఓ కాలేజి డ్రాపౌట్ గాడి ప్రేమ కథ
O College Dropout Gadi Prema Katha
Author: Suryadevara Rammohana Rao
Pages: 364Language: Telugu
''ఇది నిజంగా అద్బుతమే సర్! అతడ్ని మెచ్చుకొనక తప్పదు. నేను క్రియేటర్నేగాని సేల్స్ పర్సన్‌ని కాదు. ఇతను వ్యాపార విస్తరణకి పథకరచన చేయటంలో జీనియస్‌గా ఒప్పుకుతీరాలి'' అన్నాడు త్రివిక్రమ్‌ని మెచ్చుకుంటూ వినోద్.
మధుసూదనరావు ఆనందం నాలుగు అంచెలు పైకివెళ్ళి ఆగింది. ఆ ఉత్సాహంలోనే సుధాకర్ నాయుడితో అన్నాడు.
''సర్! వెళ్ళిపోయిన త్రివిక్రమ్ చదివింది ఇంటరే కావచ్చు. కాని అపారమైన తెలివితేటలున్న కుర్రాడు. ఒక మనిషి జీవితంలో చదువు వేరు, వృత్తి వేరు, వ్యాపారం వేరు, కొందరు చదువుతో గొప్పవాళ్ళు అవుతారు. కొందరు వృత్తి నైపుణ్యంతో గొప్పవాళ్ళు అవుతారు. కొందరు వ్యాపారరంగంలో గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి గొప్పవాడు కావటానికి చదువు ఎంతమాత్రం కొలబద్ద కాదు అనేది నా అభిప్రాయం. మీరెలాగూ వరేణ్యను అతనికివ్వరు. మీ లెవల్‌కి అది సరితూగే విషయం కూడా కాదు. అంచేత మీకు తెలిస్తే ఆ కుర్రాడి అడ్రస్ చెప్పండి సర్, నా కూతురు మమతను యిచ్చి పెళ్ళిచేసి అల్లుడ్ని చేసుకుంటాను'' అనడిగేసాడు ముచ్చటపడిపోతూ.
ఆ మాటలు వినగానే మొదటిసారిగా సుధాకర్ నాయుడిలో త్రివిక్రమ్ విషయంలో పాజిటివ్‌గా ఆలోచనలు ఆరంభమయ్యాయి. అదే సమయంలో పక్కనున్న వినోద్ ముఖం చిన్నపోయింది. అటు కంప్యూటర్ ఆపరేటర్ ముఖం చిటపటలాడింది. ఎందుకంటే ఆ ఆపరేటర్ ఎవరోకాదు. గుండుమల్లి మమత. తండ్రి మాటలు వింటూనే 'డాడీ' అనరిచింది.
''ఏమిటమ్మా?'' అడిగాడు మధుసూదనరావు.
Ok
ఈ మధ్య తెలుగు సినిమాలకి ఈ నవాలకి చాల దగ్గర సంబంధం ఉంది..
This is one of the suryadevara best one.Good plot and narration.There are some loopholes but overall its good one.
Regards,
Vishnu
Old one ..... పాత నవల.... సూర్యదేవర గారి 74వ నవల... అసలు పేరు "ఛాలెంజ్" కొత్త నవల కాదు.. దయచేసి చెక్ చెసుకోగలరు....