• Nynam Chindanthi Sastrani
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నైనం ఛిందన్తి శస్త్రాణి

    Nynam Chindanthi Sastrani

    Author:

    Pages: 187
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రాత్రి పన్నెండు గంటలయింది. అంతా నిశ్శబ్దం...

గుడ్డి దీపపు వెలుగులో కళ్ళు తెరుచుకుని ఇంటి కప్పువంకే చూస్తూ మధనపడుతున్నాడు విజయ్...

అతడి కళ్ళముందు పెళ్ళయి రెండు నెలలయినా కాకముందే భర్త మరణించిన చంద్రిక... నెలలోగా పెళ్ళి కావల్సి, ఆగిపోయిన కాత్యాయినీ కదులుతున్నారు.

సెల్ రింగయింది.

'ఇంత రాత్రిపూట ఎవరా చేసింది?' అనుకుంటూ పక్కనే టీపాయ్ మీద వున్న సెల్‌ను తీసుకుని దాని వంక చూశాడు.

కాల్ చేస్తున్నది కాత్యాయిని!

చటుకున్న లేచి కూర్చుంటూ ఆన్ చేశాడు - అర్థరాత్రిపూట తనతో అవసరమేమొచ్చిందా అనుకుంటూ.

"చెప్పు... కాత్యాయినీ!" అన్నాడు ఆదుర్దాగా.

ఆమె పకపకా నవ్వింది.

"నా అంచనా సరైనదే.. మీరు నిద్రపోతుండరని అనుకుంటూనే వున్నాను... ఒక్కమాట చెబుదామని ఫోను చేశాను... తాంబూలాలు పుచ్చుకున్న రోజున మనిద్దరినీ పక్కపక్కనే పీటలమీద కూర్చోబెట్టినప్పుడే నేను మానసికంగా మీ భార్యనయ్యాను... ఇక వివాహమంటూ ప్రత్యేకంగా జరగటమనేది బయట నలుగురికీ తెలియటం కోసం చేసే ఓ ప్రక్రియే.. మీరన్నట్లుగా, మన వివాహం ఆలస్యమవుతున్నది కాబట్టి మా నాన్నను నాకు మరో సంబంధం చూడమనటం, నేను పెళ్ళి చేసుకోవటం అంటే - నేను నా శారీరక సుఖాల కోసం తపిస్తూ మరో మగవాడి చేత మెడలో నలుగురి ముందూ తాళి కట్టించుకోవటమన్నమాటే... నేనంత బలహీనురాలిని కాదు అని చెప్పటానికే ఇప్పుడు ఫోన్ చేస్తున్నది... ఓకే... నేను చెప్పింది మీకు స్పష్టంగా అర్థమయింది కదా... ఇక ఆ విషయం గురించి ఆలోచిస్తూ మీ మనస్సు పాడు చేసుకోకుండా హాయిగా నిద్రపోండి... అప్పటికీ నిద్రపట్టకపోతే... దృష్టిని కేంద్రీకరించి ఒకటి నుండి వరసగా ఒంట్లు చదువుకుంటూ కళ్ళు మూసుకోండి... అయిదు నిముషాల్లో పడుతుంది... గుడ్‌నైట్!"

కాత్యాయిని సెల్‌ను ఆఫ్ చేసింది.

Preview download free pdf of this Telugu book is available at Nynam Chindanthi Sastrani