-
-
నువ్వు అక్కడ నేను ఇక్కడ
Nuvvu Akkada Nenu Ikkada
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 152Language: Telugu
ఉవ్వెత్తున నెగడు మండుతోంది.
నెగడు చుట్టూ కూర్చుని వున్నారు కార్తీక్, మల్లు, కోయిల, రాజ్బాబు.
నెగడుకు దగ్గరలోనే నేలకు మేకులు కొట్టి గుర్రాలను కట్టేసి ఉంచారు.
ఉండుండి అడవి జంతువుల అరుపులు భీకరంగా వినపుతున్నాయి.
అడవిలోకి ప్రవేశించినప్పటి నుంచి అలవాటు పడినా, గుండెలు జలదరించేలా వినిపిస్తున్న ఆ అరుపులకు గుర్రాలు అదిరిపడుతున్నాయి.
బలంగా కట్టి వుండకపోతే అవి ఎప్పుడో ఆ అరుపులకు బెదిరి పరుగుతీసుండేవి.
ఆ గుర్రాల కంటే ఎక్కువగా రాజ్బాబు భయపడుతున్నాడు.
అతి దగ్గర నుంచి వినిపించిందొక క్రూరమృగం అరుపు. ఉలిక్కిపడి అంతెత్తున ఎగిరాడు రాజ్బాబు.
ఎగిరి కోయిలమీద పడి గట్టిగా పట్టుకోసాగాడు గానీ కోయిల పక్కకు జరగంతో కిందపడి నేలకు కరుచుకున్నాడు. ''అమ్మో'' అని అరిచాడు.
పాక్కుంటూ పోయి మల్లును గట్టిగా పట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు.
''నాకు ఈ అడవిలో మృత్యువు రాసి పెట్టివుంది. నన్ను కాపాడే వారెవరురా దేవుడో... చుట్టూ మనుషుల్ని అప్పడంలా నమిలే జంతువులు... మధ్యన నేను... ఓరి దేవుడో... నాకు దిక్కు ఏదిరో...'' అని ఏడవసాగాడు.
''నీకేం భయం లేదయ్యా రాజ్బాబు! నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తా ధైర్యంగా ఉండు'' అని భుజం తట్టి ఓదార్చారు మల్లుదొర.
అయినా వినలేదు. గుక్కపట్టి ఏడవసాగాడు రాజ్బాబు. కార్తీక్ ఏమీ పట్టించుకోకుండా ఆకాశంలోని చుక్కల్ని చూడసాగాడు.
రాజ్బాబు గోల వినిపించి తిక్కరేగింది కోయిలకు.
''ఇదిగో... నువ్వు ఏడుపు ఆపకపోయావో జంతువులు తినడం కాదు... నేనే నిన్ను అప్పడంలా తినేస్తా'' అని బెదిరించింది.
ఆ బెదిరింపుతో కొంచెం తగ్గాడు రాజ్బాబు. అయినా సన్నగా రాగాలు తీస్తూనే వున్నాడు.
''ఈ రాత్రి లోపల ఏదో జంతువు వస్తదిరో... నన్ను మింగేస్తదిరో నాకు దారేదిరో దేవుడో'' అని. ఇక కార్తీక్ వినలేకపోయాడు.
''ఇంతటితో ఆపకపోయావో జంతువులు వచ్చి మింగటం కాదు, నిన్నే జంతువుల మధ్యకు విసురుతా. ఇక్కడికి రాకుండనే మింగేస్తాయి'' అని బెదిరించాడు.
అంతటితో ఆపేశాడు రాజ్బాబు తన ఏడుపును.
Not up to the standard of the writer