• Nuvve Nenu Nene Nuvvu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నువ్వే నేను నేనే నువ్వు

    Nuvve Nenu Nene Nuvvu

    Publisher: Kokilam Granthamala

    Pages: 132
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పులిగడ్డవారు మంచి హాస్య ప్రియులు. ఇంతకుముందు వచ్చిన కథా సంపుటాల్లో సింహభాగం హాస్య కథలే. ఈ సంపుటిలోనూ అలాంటి కథలున్నాయి. ‘పిసినారిగారి ఫ్యాంటు పాట్లు’ ‘కంటి తుడుపు’ కథలు అవే. కంటి ‘తుడుపు' కథ కేవలం నవ్వుకుంటానికి కాదు. ఇందులో ‘చీపురు’కి చెందిన గొప్ప సెటైర్ వుంది. ‘స్వచ్ఛభారత్’ ఉద్యమంలా ఆడవారు ఇంట్లో చేపట్టవలసిన ‘చీపురు’ ఉద్యమం తప్పకుండా అవసరం.

ఈ కథల్లో అనేక వాస్తవాలున్నాయి. ఢిల్లీ భారతదేశపు గుండె. మరి "ఢిల్లీకి గుండె వుందా?" అంటారు గంజాయి వనం కథలో. ఈ కథలో ఏ ప్రముఖులనూ ఆయన వదిలిపెట్టలేదు. కంటి ‘తుడుపు’ కథలో ‘మద్యగాళ్ళు’ అనే పదప్రయోగం వుంటుంది. 'నువ్వే నేను నేనే నువ్వు’ కథను భిన్నంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరికి వారు తమని తాము ఈ కథలో చూసుకోవచ్చు.

ముఖ్యంగా ఈ కథలన్నింటా మధ్యతరగతి జీవితాల్లో వున్న డొల్లతనం, ఊగిసలాట, అపార్ధాలు, స్పందనలను చిత్రించారాయన. ఇందులో చిన్న కథలూ వున్నాయి. అవి కలిగించే ప్రభావాలు మాత్రం ‘పెద్ద’విగా వుంటాయి.

- పి. చంద్రశేఖర్ ఆజాద్

Preview download free pdf of this Telugu book is available at Nuvve Nenu Nene Nuvvu