• Nutana Rajyanga Vidhi Vidhanalu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • నూతన రాజ్యాంగ విధి విధానాలు (free)

    Nutana Rajyanga Vidhi Vidhanalu - free

    Author:

    Pages: 49
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం వ్రాయడం నా సందేహాలకు నేనే జవాబు చెప్పుకోవాలనే ఆలోచనా ప్రయత్నం మాత్రమే. ఎవరినీ ఉద్దేశించి విమర్శ చేయాలని, కించపరచాలని నా మనసులో లేదని హృదయపూర్వకముగా తెలియజేసుకొంటున్నాను.

ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం, నాకున్న ఆలోచనలకు, అనుమానాలకు, సంధిగ్ధాలకు, అంతరాత్మ ప్రబోధించిన ఆలోచనలను కాగితాలమీదకు ఎక్కించడం జరిగింది. దీనికి వేరెవ్వరూ బాధ్యులు కారు. పరిపూర్ణంగా నేనే బాధ్యుడను.

నేను తప్పుగా వ్రాసివుంటే నన్ను నిందించండి. కాదంటే క్షమించండి. నేను రాసిన అబద్దాల నుండి ప్రత్యామ్నాయ నిజాన్ని వెలికితీసే ప్రయత్నం చేయండి. ఒప్పులు ఉన్నాయనుకుంటే ఆలోచించండి. మార్పును ఆహ్వానించండి. తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయండి. ఈ సమాజాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మార్పుకు మీవంతు కృషి చేయండి.

ఇక్కడ వేదాంత గ్రంథంలోని సంస్కృత శ్లోకాలు, లాటిన్ భాషలోని సూక్తులు చెప్పటం లేదు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల, గురువుల, స్నేహితుల, వేల సంవత్సరాలుగా ప్రోగు చేసి ఉంచిన మేధావుల జ్ఞానసంపద నుండి ఒక నలుసు తీసుకున్నందుకు నా మనసులోని వెలితిని పూడ్చుకోవడానికీ, నా ఆరాటాన్ని వెలిబుచ్చడానికీ కృతజ్ఞతపూర్వకంగా చేసిన ప్రయత్నం తాలూకు ఫలితం ఈ పుస్తకం.

ధార్మికతో ఆధ్యాత్మికతతో ఈ దేశానికి ఎలాంటి రాజ్యాంగం కావాలి? తద్వారా ఎలాంటి రాజకీయ నాయకుల పరిపాలన కావాలి? వీటిద్వారా ప్రజలకు ఎలాంటి న్యాయం, రక్షణ కలిగిస్తూ, ఈ రెండింటి చివరి అంచుల మధ్య న్యాయం ధర్మం సమానత్వం స్వాతంత్ర్యము సౌభ్రాతృత్వము, కృతజ్ఞతా పూర్వక దృక్పథం, భద్రత ఆదరణ శాంతి సహనంతో కూడిన వైఖరిని కలిగి ఉండాలి అన్న విషయాన్ని విశదీకరించడానికి ఎక్కడో చదివిన, ఎప్పుడో విన్న కథ ఇచ్చట ఉదహరింపబడింది.

- ఆచార్య శేషయ్య కందమూరు