-
-
నూరేళ్ళ తెలుగు నవల (1878 - 1977)
Nurella Telugu Navala 1878 1977
Author: Sahavasi
Publisher: Perspectives
Pages: 240Language: Telugu
Description
1878 నుంచి 1977 దాకా గడిచిన నూరేళ్ళలో తెలుగు సమాజం ఏఏ మలుపులు తిరిగింది? ఏఏ ఎగుడుదిగుడులకి లోనైంది? వర్గవైరుధ్యాలు ఏ స్థాయిలో వ్యక్తం అయ్యాయి? ప్రజా చైతన్యం ఎలా వెల్లువెత్తింది? ఈ నూరేళ్ళ తెలుగు సాహిత్యచరిత్రంటే నూరేళ్ల తెలుగుభాషా చరిత్ర మాత్రమే కాదు... నూరేళ్ళు తెలుగునాట నడిచిన రాజకీయార్థిక సామాజిక చారిత్రక విశ్లేషణ కూడా. అందుకు ఈ నవలల పరిచయం ఒక చిరుదివ్వెగా ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం. ఈ ప్రచురణ ప్రయత్నంలో రచయితల జనన మరణ తేదీలు సేకరించటంలో చాలా ప్రయాసపడ్డాం. కొంతమంది తేదీలు ఒక్కోచోట, ఒక్కో రకంగా ఉన్నాయి. నూరేళ్ళ చరిత్రనే పట్టుకోలేకపోవటం మన వెనకబాటుతనాన్ని, చారిత్రక దృష్టిలోపాన్ని ఎత్తి చూపుతోంది.
Preview download free pdf of this Telugu book is available at Nurella Telugu Navala 1878 1977
Login to add a comment
Subscribe to latest comments
