-
-
నెంబర్ 28
Number 28
Author: Madhubabu
Publisher: Madhubabu Publications
Language: Telugu
పాకిస్తాన్లో బంధింపబడిన తన మిత్రుడి సోదరుడిని విడిపించడానికి ఇస్లామాబాద్ వెళ్ళిన షాడోకి అనుకోకుండా ఓ రహస్యం తెలుస్తుంది. పాకిస్తాన్ అణు విద్యుత్ వ్యవస్థకి మూల స్తంభమైన కరీంఖాన్ని కిల్లర్స్ గాంగ్ కిడ్నాప్ చేయబోతోందని తెలుసుకున్న షాడో పాకిస్తాన్ స్పెషల్ బ్రాంచిని హెచ్చరిస్తాడు. కానీ వారా సమాచారాన్ని తేలికగా తీసుకుంటారు. కరీంఖాన్ కిడ్నాపయ్యాక, పాకిస్తాన్ సీనియర్ నేతలు ఇండియాకి వచ్చి షాడో సహాయం కోరుతారు.
పాకిస్తాన్ ఏజంట్ బాన్సీతో కలసి కరీంఖాన్ ఉన్నట్లు భావించబడుతున్న ప్రాంతానికి బయల్దేరుతాడు షాడో. వారెక్కిన విమానం సముద్రంలో కూలిపోగా షాడో, బాన్సీ ఆ దుర్ఘటన నుంచి ఎలా బయటపడ్డారు? ఏయే ప్రమాదాలు ఎదుర్కున్నారు? షాడోని చివరిదాకా వెంటాడినది ఎవరు? కరీంఖాన్ని షాడో ఎలా రక్షించగలిగాడు?
ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు కావాలంటే ఈ రోమాంచక నవల చదవాల్సిందే. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే నవల ఇది.
This book is now available in Tenglish script with Kinige. For details, click on the link.