• Nrusimha Puranamu
  • Ebook Hide Help
    ₹ 543
    603
    9.95% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నృసింహపురాణము

    Nrusimha Puranamu

    Publisher: S.R. Book Links

    Pages: 592
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవిత్రయమనే కీర్తిముక్తాహారానికి నాయకమణి ఎఱ్ఱన. ఎఱ్ఱనను మినహాయించి తెలుగు సాహిత్యాన్ని చూస్తే ఎవరూ పూరించలేని లోటు స్పష్టంగా కన్పిస్తుంది. సకలవేద సారమైన మహాభారత రచనను సంపూర్ణం చేసిన ఘనత ఇతనిదే. నన్నయ భారత రచనకు శ్రీకారం చుట్టినా, తిక్కన ఒక్కచేతిపై ముప్పాతిక మువ్వీసం నడిపించినా దానిని సంపూర్ణాకృతిలో లోకానికందించినవాడు ఎఱ్ఱన. హరివంశం రాస్తేనే మహాభారతానికి సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. అందుకే ఆరణ్య పర్వశేష రచనానంతరం ఎఱ్ఱన హరివంశరచననూ పూర్తి చేశాడు. అనంతరం శ్రీమన్నారాయణుని అవతార విభూతికి సంబంధించిన నరసింహావతార కథను స్వీకరించి రచించాడు. దానికే నృసింహ పురాణమని పండిత లోకంలో పేరు పడింది.

***

మించిన వేడ్క వీనులకు మిక్కుటమై మధువృష్టి గ్రమ్మ రా

యంచలు కూయ గ్రౌంచమును నావల గూయ గడంగు భంగి...

అని తమ వినయాన్ని ప్రకటించుకున్న కవిత్రయ మధ్యమణి ఎఱ్ఱనగారు అరణ్య పర్వశేష రచనతోటే ప్రబంధపరమేశ్వర బిరుదు భాజనులయ్యారు. సహృదయలోకం కూడా వారిని కవిత్రయంలోనివానిగా గుర్తించి ఊరుకుంది. ఎఱ్ఱన సోమన పోతనల కవిత్వాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేసినప్పుడు ఎఱ్ఱన పట్ల ప్రత్యేక దృష్టి ఏర్పడింది. వారి నృసింహ పురాణం చదివినపుడు తెలుగు సాహిత్యలోకం వారిని గుర్తించవలసినంతగా గుర్తించ లేదేమో అనిపించింది. విద్యార్థులకు నృసింహపురాణం కావ్యపాఠంగా చెప్పినపుడు దానికొక వ్యాఖ్య రాయాలనే సంకల్పం కలిగింది. చాలకాలంగడిచాక అది నేటికీ ఫలించింది.

- రామకృష్ణ శాస్త్రి

గమనిక: " నృసింహపురాణము " ఈబుక్ సైజు 5mb
Preview download free pdf of this Telugu book is available at Nrusimha Puranamu