-
-
నోస్టాల్జియా
Nostalgia
Author: Pothuri Vijayalakshmi
Publisher: Sri Rishika Publications
Pages: 221Language: Telugu
ఇవి పొత్తూరి విజయలక్ష్మి గారి జ్ఞాపకాలు... వేటి గురించి ఈ జ్ఞాపకాలు? తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మలు, అమ్మానాన్నలు, ఇంకా దగ్గరి బంధువులు, సొంతూరి జ్ఞాపకాలు... చిన్ననాటి ఆటలు, పాటలు, అప్పటి అలవాట్లు, పద్ధతులు... అలనాటి అభిమానాలు, ఆప్యాయతలు, అనుబంధాలు...
బాంధవ్యాలకే తప్ప సంపదకి ప్రాధాన్యతనీయని వ్యక్తులు... విశిష్ట వ్యక్తిత్వాలు... బాధ్యతలను పంచుకోవాలనుకునే మనుషులు... ప్రేమను పంచే మమతలు... పెద్దలని గౌరవించే పిన్నలు,
పిల్లల అభిప్రాయాలను మన్నించే పెద్దలు...
పెళ్ళిళ్ళు, పండగలు పబ్బాలు... ఉత్సవాలు వేడుకలు... అమ్మకాలు, కొనుగోళ్ళు... నిజాయితీ... నిబద్ధత... విలువలు...
ఒక పెన్సీలు ఇంజక్షన్, ఒక కరెంట్ వింజామర, ఇంకా అరకు అల్లం! సంతకం పెడితే ఇంటికొచ్చే చీరె! చిరకాలం మన్నే ట్రంకు పెట్టే!
ఇంగిలీషు... తెలుగు... హిందీ పాఠాలు....
అద్భుతమైన బాలభోగం... అందమైన దీపావళి... అసలైన పండగ...
బాపట్ల స్టేషన్ ప్లాట్ఫారం 3 మీదుగా దూరాభారాలు...
అందమైన జ్ఞాపకం అమ్మమ్మ పుట్టిల్లు... అభిమానాల నెలవు...
ఓ గాజుల బత్తుడు... ఓ పాదరక్షల బంధం, ఇద్దరికీ చెరో ఐదు...
ఏంటివన్నీ అనుకుంటున్నారా? ఒక్కో సంఘటనలో, ఒక్కో కథనంలో ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తారు... ఆ వ్యక్తితో ముడిపడ్డ జ్ఞాపకాలను పొత్తూరి విజయలక్ష్మిగారు పాఠకులతో అందంగా పంచుకుంటారు.
ఈ 'నోస్టాల్జియా'లో కల్మషం లేని మనుషులను... కల్తీ కాని అభిమానాలను కళ్ళకి కట్టారు రచయిత్రి.
ఈ స్మృతులలో కొన్ని నవ్విస్తాయి, కొన్ని ఆలోచింపజేస్తాయి... మరికొన్ని కంటికి చెమ్మనిస్తాయి. జీవితం పట్ల సానుకూల భావాన్ని కలిగించే ఈ మధుర స్మృతులు చదువరులను అలరిస్తాయి.
- కొల్లూరి సోమ శంకర్
గమనిక: " నోస్టాల్జియా " ఈబుక్ సైజు 22.3mb