-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
నూట ఒక్క ప్రశ్నోత్తరాల రూపంలో 'ఆంధ్ర ప్రదేశ్ ఎపార్ట్మెంట్ల చట్టం, 1987' (free)
Noota Okka Prasnottarala Roopamlo Andhra Pradesh Apartmentla Chattam 1987 - free
Author: Tatavarti Srinivasa Rao
Pages: 92Language: Telugu
ఎపార్ట్మెంట్ల భవనాలలోని ఫ్లాట్లలో జీవించడం మన సమాజంలో ఒక నూతన సంస్కృతిని ప్రవేశపెడుతోంది. వ్యక్తి జీవనానికి భంగం కలగకుండా సమిష్టి జీవనానికి దోహదం చేసేదానినే ‘ఫ్లాట్ కల్చర్’ అంటారు. సాంప్రదాయ కుటుంబ పరిధికి మించిన సమిష్టి కుటుంబ జీవనానికి ఈ ఫ్లాట్ కల్చర్ ప్రాతిపదికగా ఉంటోంది. దీనికి ఒక కొత్త మానసిక దృక్పధం (mind set) అవసరమవుతుంది. అటువంటి సహ జీవనానికి తోడ్పడే ముఖ్య సాధనం నివాసితుల సంక్షేమ సంఘం (Residents’ Welfare Association).
ఇది మన ప్రజాస్వామిక జీవనానికి ప్రాధమిక పాఠశాల వంటిది. పెద్దలకు, పిల్లలకు సామరస్యయుతంగా సహ జీవనం చెయ్యడానికి అవసరమైన వైఖరి దీని ద్వారా అలవడుతుంది.
కానీ, దురదృష్టవశాత్తు మన శాసనకర్తలు ఈ సమిష్టి జీవనానికి సంబంధించిన ఎపార్ట్మెంట్ల చట్టాన్ని చేసేటప్పుడు దాని సాంఘిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకున్నట్టుగా కనిపించడం లేదు. ఎపార్ట్మెంట్లలో నివసించే వారి సాధకబాధకాలతో ప్రమేయం లేకుండా కేవలం బిల్డర్ల ప్రయోజనాల కోసం మాత్రమే తొందరగా ఈ చట్టం చెయ్యబడిందని అనిపిస్తోంది. దీంట్లో మున్సిపల్ అధికారులు, స్థలం ఓనరు, బిల్డరు, ఇంజినీరు, ఆర్కిటెక్టు, ఎపార్ట్మెంటు ఓనరు - వీరిలో ఎవరెవరి బాధ్యతలు ఏమిటో ఒక క్రమ పధ్ధతిలో నిర్వచించబడలేదు. ఇందులో చాలా మార్పులు అభిలషణీయం.
ఈ సందర్భంలో పట్టణీకరణ వల్ల గృహ వసతుల విషయంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకి సంబంధించిన ఈ ఏకైక చట్టాన్ని విశ్లేషించి, ఆ చట్టంలో ఉన్న లోటుపాటులని చూపించి, తగిన సవరణలని ప్రతిపాదిస్తూ శ్రీ తటవర్తి శ్రీనివాస రావు గారు చేసిన కృషి శ్లాఘనీయం.
మరొక విషయం. మన తెలుగు భాషలో కళాత్మకమైన సాహిత్యం చాలానే ఉన్నా, సామాజిక ప్రయోజనం ఉన్న సాహిత్యం చాలా తక్కువగా ఉంది. అందుచేతే తెలుగు వాడుక బాగా తగ్గిపోతోంది. అటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఎపార్ట్మెంట్ల చట్టం గురించి తెలుగులో ప్రశ్నోత్తరాల రూపంలో పుస్తకం రాసి, తమ సమాఖ్య తరఫున వెలువరుస్తున్న సందర్భంలో శ్రీ తటవర్తి శ్రీనివాస రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
- చెలికాని వెంకట జగన్నాధ రావు
