• Nomula Puraskara Kathalu 2012 2013
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నోముల పురస్కార కథలు 2012, 2013

    Nomula Puraskara Kathalu 2012 2013

    Pages: 120
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నిప్రాంతాల కథలతో వెలువడుతున్న మొదటి సంకలనమిది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, దక్షిణ తెలంగాణ (రాయలసీమ మినహా) జీవితాలు ఇందులో ఇమిడాయి. 'నోముల పురస్కార కథలు' పేరిట 2012, 2013 సంవత్సరాలకు గాను ఎంపిక చేసిన ఈ పది కథల్లో మాయమైపోతున్న మనిషి ఉన్నాడు. అమానవీయంగా మారుతున్న మానవ సంబంధాలు, ఆధునికత, అభివృద్ధి పేరిట ధ్వంసమవుతున్న జీవితాలూ రికార్డయ్యాయి. ఆధునిక సమాజం వెలేసిన ఆదివాసీల అధ్వాన్నపు బతుకులపై ఇందులోని కథలు వెలుతురు ప్రసరింపజేశాయి. వికలాంగుల, మానవహక్కుల సాధనకోసం ఉద్యమించక తప్పదని ఇవి తేల్చి చెప్పాయి. నిత్యజీవితంలో మనిషి ఎన్నడూ ఆలోచించని/ సమస్యగా పరిగణించని/ ఊహించని విషయాలు ఈ కథల్లోని వస్తువులు. పాఠకుణ్ణి ఉన్న తావుల ఉండనీయకుండా, నిరంతర పరిష్కారాన్వేషణ కోసం తరిమే విధంగా ఈ కథలున్నాయి. ఇవన్నీ భవిష్యత్‌లో మరింత జటిలమయ్యే సమస్యల్ని వర్తమానంలో చెప్పిన కథలు. ఒకరు ఒప్పుకోవాలని, మరొకరి మెప్పు పొందాలని కాకుండా ఆర్తితో, బాధతో చెప్పిన కథలివి. ఈ సంకలనంలోని బాధల ఏకరణకు పెట్టుబడిదారి విధానం విధ్వంసం చేసిన జీవితాలు దారి చూపాయి. పెట్టుబడిదారి జీవితంలో ఎవరి జీవితం వాళ్ల చేతుల్లో ఉండదు. మనిషి జీవితాన్ని మార్కెట్‌, మార్కెట్‌ భావజాలం నియంత్రిస్తది. ఈ విషవలయంలో చిక్కుకున్న సామాన్యుల మనుగకు 'మాన్యత' కల్పించేందుకు పడ్డ తపన ఈ కథలు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 'తెలుగు కథ'కు ఒక తొవ్వ చూపించే సంకలన మిది. రాష్ట్రాలుగా విడిపోయినా రెండు ప్రాంతాల్లోనూ 'కథ' వర్ధిల్లాలి, అంతకంతకు కొత్తపుంతలు తొక్కాలి. వెలితిగా ఉన్న జీవితాల వెతలు మరెన్నో వెలుగులోకి రావాలి.

- సంగిశెట్టి శ్రీనివాస్‌

Preview download free pdf of this Telugu book is available at Nomula Puraskara Kathalu 2012 2013