• Nomula Puraskara Kathalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నోముల పురస్కార కథలు

    Nomula Puraskara Kathalu

    Pages: 132
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకంలో మొదటి ఐదు కథలు 2010లో, తర్వాత ఐదు కథలు 2011లో పురస్కారం పొందినాయి.

వై. శ్రీరాములు కథ 'అటు అమెరికా ఇటు అమడగూరు' వర్తమానాన్ని చిత్రించిన మంచి కథ. భూమి విలువను, దానితో మానవుని సంబంధాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పిన కథ. 'విధ్వంసం' బొగ్గు కార్మికుల చీకటి బతుకులను చిత్రించిన కథ. ఈ కథలో పాఠకుడిచేత కంటతడి పెట్టిస్తాడు రచయిత ఓదెల వెంకటేశ్వర్లు. మూడవ కథ 'కాలం మారినా స్థానం మారలేదు'. దళితులు ఉద్యోగాలు చేస్తున్నా సమాజం వారిని అమానవీయంగానే చూస్తుంది అని రచయిత ఆకుల రాఘవ ఈ కథలో చెప్పినారు. 'ఉమ్మెత్తపూలు' శిరంశెట్టి కాంతారావు తెలుగు సాహిత్యానికి అందించిన విలువైన కథ. కాలుష్యానికి తల్లడిల్లుతున్న 'కిన్నెరసాని'ని హృదయంతో చిత్రించినారు. సామాన్యుల చైతన్యం ఏకమైన తీరును నేర్పుగా చెప్పినారు. ఐతా చంద్రయ్య 'పావలావడ్డీ' కథ ప్రచార పథకాలకు విలువనిచ్చే సర్కారుకు చెంపదెబ్బ. పావలా వడ్డీ రుణాల కోసం పేద మహిళలు పడుతున్న పాట్లు అవి చివరకు ఎండమావులుగా మారుతున్న తీరు ఆలోచింప చేసేదిగా ఉంది.

వసుంధర 'వ్యక్తిగతం' కథ మారుతున్న కాలాన్ని చిత్రించిన కథ. భార్యాభర్తల ప్రేమ, ఆచరణాత్మక జీవితం చిత్రించడంలో పరిణతి కనిపిస్తుంది. ఆలోచన రేకెత్తించే మంచి కథ ఇది.'లోతు..' రామా చంద్రమౌళి కథ. డబ్బు వెంట మనిషి ఉరుకులు పరుగులు పెడుతున్నంత కాలం మనశ్శాంతి ఉండదు అని చెప్పే కథ. వర్తమాన జీవితంలో సెల్‌ ఫోన్‌ మనిషిని ఎంత అల్లకల్లోలానికి గురిచేస్తుందో యెన్నం ఉపేందర్‌ 'నెట్‌వర్క్‌ ఫెయిల్యూర్‌' కథలో చక్కగా చిత్రించినారు. నాగరికులమని చెప్పుకునే వారికంటే గ్రామీణ పేదల ఆలోచనే మానవీ యంగా ఉంటుందని, మనశ్శాంతి నిస్తుందని చెప్పిన కథ సత్యాజీ రాసిన 'ఆనందమే జీవిత మకరందం'. ఎదుటి వారికి సహాయం చెయ్యడంలోనే తృప్తి ఉందని 'జీవనవేదం' కథలో మంచికంటి అందంగా చెప్పినారు. ఉత్తమమైన ఈ కథలను పాఠకులు ఆదరిస్తరని ఆశిస్తున్నాం.

- ఎలికట్టె శంకర్‌రావు

Preview download free pdf of this Telugu book is available at Nomula Puraskara Kathalu