-
-
నివురు
Nivuru Kavitvam
Author: Kondepudi Nirmala
Pages: 52Language: Telugu
Description
కార్చిచ్చు రగలకుండా కర్ఫ్యూ విధించడం ఒక పద్ధతి అయితే
కార్చిచ్చునీ కర్ఫ్యూని ఒకే చేత్తో నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత
***
శత్రువు ముసుగువీరుడు కాదు
తన వికృతమైన ముఖకవళికలకి
మన ముఖం తగిలించుకుని తిరుగుతున్నాడు
***
ఆశపోతు అమెరికా అందానికి కొలబద్దని
ఒక ఆడపిల్ల రూపంలో మా కళాశాలకి పంపింది
ఇప్పుడు తెల్ల అబ్బాయిలూ నల్ల అబ్బాయిలూ
ఒక అబద్ధం కోసం యుద్ధం చేస్తున్నారు
***
నరానికి సూది గుచ్చితే రక్తమే వస్తుంది
నగరానికి సూది గుచ్చితే భయం వచ్చింది
***
పదేపదే నువు వక్రీకరించి వదిలిన ఉపమానాల మధ్య
నా చర్మగీతం ఎంత చేదిక్కిపోయిందో తెలుసా....?
***
ఎన్ని ప్రమాదసూచికలుంటే
అన్ని ప్రాజెక్టులూ, లాప్ట్యాపులూ తెరుచుకుంటాయి
వాటి దంతాల మధ్య నా గ్రామాలు
నెత్తురోడుతూ కనిపిస్తాయి
Preview download free pdf of this Telugu book is available at Nivuru Kavitvam
1. You should arrange books as per year of publication, so that searching for new addtions will easier.
2. You should put year of publication in the details of the book so that one need not go to preview page.
3. Under the preview of Nivuru by Kondepudi Nirmala, you have put preview of Nivuru by Kakani Chakrapani. Pls correct it