-
-
నివురు
Nivuru
Author: Dr. Kakani Chakrapani
Publisher: Media House Publications
Language: Telugu
రచయిత గురించి
ఆధునిక తెలుగు కథా, నవలా సాహిత్యంలో తనదైన శైలిలో ప్రత్యేకతను సంతరించుకున్న రచయిత శ్రీ కాకాని చక్రపాణి. మానవ జీవన సంఘర్షణలను, ఆక్రోశాలను, ఆత్మీయతానుబంధాలను హృద్యమైన శైలిలో రూపుదిద్దగల శిల్పి ఆయన. శ్రీ చక్రపాణి పాత్రలు నేల విడిచి సాము చేయవు. అవి మనకు ఎంతో సుపరిచితాలనిపిస్తాయి. అవిశ్రాంతంగా సాగుతున్న ఆయన సాహిత్య వ్యవసాయంలో ఇప్పటివరకు ఆరు నవలలు, లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు పండించారు.
హైదరాబాద్లోని ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో ఆంగ్లబోధన వృత్తి; తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి ఆయన వ్యావృత్తి. మనిషి మృదుభాషి. తను విభేదించే విషయంలో సైతం ఎదుటివారిని నొప్పించని తత్త్వం ఆయనది. స్నేహితులలో కబుర్లంటే ఇష్టపడతారు. "తెలుగు నవలా సాహిత్యంపై సోమర్సెట్ మామ్ ప్రభావం" అన్నఅంశంపై పరిశోధన చేసారు. ఆ పరిశోధనలో భాగంగానే మామ్ రాసిన "ఆఫ్ హ్యుమన్ బాండేజ్" నవలను అనువదించారు.
అందుకోని ఆశల్లేవు గానీ, జీవితానికి ఎంతో కొంత సార్దక్యం పొందాలని ఆయన కోరిక.
