-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
నిత్యజీవితంలో భగవద్గీత (free)
Nityajeevitamlo Bhagavadgita - free
Author: K. Seshaiah
Publisher: Self Published on Kinige
Pages: 81Language: Telugu
ఈ జగత్తులోని మానవజన్మ నేటిది కాదు. పూర్వజన్మలలో చేసిన పాపపుణ్యాల రాసి వ్యక్తమై ఒక జీవిగా రూపాంతరం చెంది, కోరికలకు దాసుడై భయానికి వశుడై దుఃఖానికి సేవకుడై, సంసారం అనే లంపటలో మునిగితేలుతూ ఆశ నిరాశల మధ్య చిక్కుకుని ఆరాటపడుతాడన్నది శాస్త్రాల సారాంశం.
శ్రీమన్నారాయణుడు జీవులఎడ తన కృప, దయ, ఔదార్యాల కారణంగా వారిని ఉద్ధరించేందుకు ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో పరిపూర్ణ అవతారంగా విలసిల్లే శ్రీకృష్ణావతారంలో మానవుని బాధలకు, రుగ్మతలకు, సమస్యలకు సమాధానంగా ఒక సాధనా సంపత్తిని అందించడానికి తన ప్రియశిష్యుడైన అర్జునుని ఎంచుకొని ఆయన ద్వారా ఒక మహాసందేశం భగవద్గీతరూపంలో అందించబడింది. భగవద్గీత మీద అనేక అనువాదాలు, వ్యాఖ్యానాలతో లెక్కలేనన్ని గ్రంథాలు వందల సంవత్సరాలుగా వెలుగుచూస్తున్నాయి. అయితే డాII కె. శేషయ్య గీతాసారాన్ని ఒక క్రొత్త కోణం నుండి స్పృశించడం ఈ చిన్ని పుస్తకం యొక్క ప్రత్యేకత. మానవుని సమస్యలు, కోరికల వలన కలిగే భయం దుఃఖం, అని వివరించబడింది. ఈ సమస్యలకు సమాధానంగా, యుద్ధం ధర్మం యోగాలను, ప్రతిపాదించబడ్డాయి. ఈ సమాధానాలను సాధనాలుగా మార్చడానికి, కర్మ భక్తి, జ్ఞాన, వైరాగ్య యజ్ఞ, యాగ, హోమ, త్యాగాలను అనుసరించాలని చెప్పడం వలన సామాన్య మానవుడికి భగవద్గీతా సారం సులభరీతిలో అర్థమౌతుందనిపిస్తుంది. ఈ చిన్నిపుస్తకంలో గీతాసారాన్ని విశదీకరించడానికి ఆ శ్రీకృష్ణపరమాత్ముడి అనుగ్రహం కారణమని రచయిత చెప్పుకోవడం సత్యదూరం కాదనిపిస్తుంది.
- సి. రామచంద్రయ్య
