-
-
నిత్యజీవితంలో ఆధ్యాత్మికత
Nityajeevitamlo Adhyatmikata
Author: Deevi Subbarao
Pages: 156Language: Telugu
ఆధ్యాత్మికత అనేది భౌతిక జీవితానికి సంబంధం లేకుండా విడిగా వుండేది కాదు. అది నిత్య జీవితంలో భాగం. ఆధ్యాత్మికత అంటే ప్రాపంచిక కార్యకలాపాలనుండి వైదొలగి సన్యసించటం కాదు. బాహ్యంగా కాకుండా, మానసికంగా భౌతిక వాంఛల్ని విడనాడటం ఆధ్యాత్మికత అనిపించుకొంటుంది. ప్రపంచంలో మనిషి తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలి.
చాలామంది అనుకొంటూ వుంటారు, తాము జీవితంలో అలసిపోయామని. ఎందుకంటే, ప్రతి ఒక్కరూ ఆనందంగా వుండాలని ప్రయత్నిస్తారు గాని, దాన్ని ఎలా పొందాలో తెలుసుకోరు. అయితే జీవితం ఎంతో అందమైనది. ఆనందం అనుభవించటానికి జీవితం వున్నది. మనిషి జీవితాన్ని ఎలా అర్థం చేసుకొన్నాడు? ఏ దృష్టితో చూస్తున్నాడు? జీవిత సమస్యలపట్ల అతడి అవగాహన ఏమిటి? అనేది చాలా ముఖ్యం. అంతేకాని, నీ ముందువున్న ప్రపంచంకాదు. ఇవాళ నీవు అలసిపోయినట్లూ, ఏది సరిగా లేనట్లూ, నీ చుట్టూరా వున్న ప్రపంచంలో ఏదీ అందంగా లేనట్లూ నీకు అనిపించవచ్చు. రేపు నీవు సంతోషంగా వుంటే, అదే జీవితం, అదే ప్రపంచం, అవే వస్తువులు నీకు చాలా అందంగా కనిపించవచ్చు. అలా జరగటానికి కారణం నీ మనస్సులోను, నీ దృక్పధంలోను వచ్చిన మార్పు.
