-
-
నిత్యజీవితంలో రసాయన శాస్త్రం
Nitya Jeevitamlo Rasayana Sastram
Author: Vemuri Venkateswara Rao
Pages: 167Language: Telugu
ఇరవై రెండేళ్ల కిందట నేను ప్రచురించిన “రసగంధాయరసాయనం” అనే పుస్తకానికి ఇది రెండవ విడత. పాత పుస్తకంలో అసంఖ్యాకంగా చోటు చేసుకున్న అచ్చు తప్పులు సవరించేను. పేరు మార్చేను. కొన్ని చోట్ల తిరగ రాసేను. మంచి బొమ్మలు సంపాదించి పుస్తకాన్ని మరికొంచెం అందంగా తీర్చి దిద్దేను. పూర్వం అచ్చు వేసిన ప్రతులన్నీ ఖర్చు అయిపోయాయి. ఈ మలి ప్రయత్నంలో సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాలకి తల ఒగ్గుతూ ఇ-పుస్తకంగా ప్రచురిస్తున్నాను.
రసాయనశాస్త్రం అనేసరికి చాల మంది భయపడతారు. అర్థం కాదంటారు. బోరు కొడుతుందంటారు. తరగతిలో కూర్చుని పాఠం వింటూ ఉంటే నిద్ర వస్తుందంటారు. ఇవన్నీ సాకులే. ఏ పని సాధించాలన్నా శ్రద్ధ ఉండాలి. అంకితభావం ఉండాలి. పరిశ్రమ చెయ్యాలి. అభ్యాసము కూసు విద్య అన్నారు. ఆధునిక విజ్ఞానశాస్త్రం మహాసాగరంలా విస్తృతం. ఇటువంటి మహాసాగరాన్ని ఈది ఆవలి గట్టుకి చేరుకోవడమే గమ్యంగా పెట్టుకొంటే మునగడం తప్ప సాధించగలిగేది ఏదీ ఉండదు. ఆ నీళ్లల్లో నీటిమట్టానికి ఎగువగా తల పెట్టి తేలడం వస్తే చాలు. ఈ సూక్ష్మం తెలియక చాల మంది నిస్పృహతో చేతులెత్తెస్తారు. అటువంటివారికి ఈ శాస్త్రం గురించి కొంచెం కుతూహలం పుట్టించడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం.
బాణసంచాలు ఎందుకలా వెలుగుతాయో, బాంబులు ఎలా పేలుతాయో తెలియాలంటే రసాయనశాస్త్రం చదవాలి. మత్తుమందులు ఎలా పని చేస్తాయి? సుగంధ ద్రవ్యాల వెనక ఉన్న రహశ్యం ఏమిటి? కల్రా ఉండలకి, కలరా వ్యాధికి సంబంధం ఏమిటి? తియ్యగా ఉన్న పదార్థాలన్నీ చక్కెరలు కావా? చక్కెరలన్నీ తియ్యగా ఉండవా? ఉప్పుకీ, కర్పూరానికి మధ్య తేడా ఏమిటి? పెట్రోలుకీ, కిరసనాయిలుకీ తేడా ఏమిటి?
వంట వండుతూన్నప్పుడు ఎన్నో రసాయన ప్రక్రియలు జరుగుతాయి. అవి అర్థం అయితే వంటలకి ఆ రుచి, వాసన ఎలా వస్తాయో తెలుస్తుంది. మందులన్నీ రసాయనాలే. మన వాతావరణాన్ని కల్మషపరచేవి రసాయనాలే. ఇలాంటి విషయాలని సమగ్రంగా అవగాహన చేసుకోవాలంటే రసాయనశాస్త్రంతో పాటు, గణితం, భౌతికశాస్త్రం, తర్కం దీక్షగా అధ్యయనం చెయ్యాలి. ఈ పని అందరూ చెయ్యలేరు. అందరికి, తేలికగా అర్థం అయే రీతిలో శాస్త్రాన్ని విడమర్చి చెప్పే పద్ధతిని “జనరంజక శైలి” అంటారు. ఇలా జనరంజక శైలిలో రాసి రసాయనశాస్త్రాన్ని ప్రజలకి దగ్గరగా తీసుకురావాలన్న కోరికే ఈ పుస్తకాన్ని రాయించింది.
- వేమూరి వేంకటేశ్వరరావు
- FREE
- FREE
- FREE
- ₹162
- ₹162
- ₹162
where I have to buy this book in this site ? where is the but button ?
[Admin] This book is available only as eBook. [/Admin]