-
-
నిర్ణీతి
Nirneeti
Author: P. S. Narayana
Pages: 160Language: Telugu
కదిలించిన చిన్న సంఘటన, చూచిన దృశ్యం, పేపర్లలో చదివిన వార్తలు రచయిత ద్వారా కథారూపం సంతరించుకుంటాయి. కొన్ని కథలు ఊహల్లోనుంచి పుడ్తాయి. మనిషి మనిషికో కథ వుంటుంది. మానవ సంబంధాలను లోతుగా పరిశీలిస్తే ఎన్నో కథలు ఉల్లి పొరల్లా విచ్చుకుంటయి. ఆ పాయలోపల ఏం ఉందోనని ఆసక్తితో ఒక్కో పొరను వల్చుకుంటూ పోతుంటే లోపల ఏమీ కన్పించదు. ఉన్నదంతా పొరల్లోనే వున్నదనే సత్యం బోధ పడుతుంది చివరకు.
శ్రీ పి.యస్.నారాయణగారి కథలు మానవ సంబంధాల చుట్టూ తిరుగుతయి. కథల్లో ఎక్కడా సంక్లిష్టత లేకుండా సాఫీగా సాగిపోతుంటయి. కథ చివర్లో ఊహించని మలుపు పాఠకుడిని ఓ కుదుపు కుదుపుతుంది.
పి.యస్.నారాయణగారి కథల్లో అనుబంధపు పరిమళాలు మనస్సును తాకుతాయి. చేయి తిరిగిన రచయిత ఆవ్వటంతో ఆయన సృష్టించిన ఏ పాత్రయినా కథలో ఒద్దికగా ఒదిగిపోతుంది. కథకు మంచి ముగింపు ఇవ్వటంలో అందెవేసిన చేయి. ఈ సంపుటిలోని కథలన్నీ ఏక బిగిన చదివించేవే.
- అలపర్తి రామకృష్ణ
మానవతా స్పర్శ – ‘నిర్ణీతి’ , ‘ఆరునెలలు ఆగాలి’ పుస్తకాలపై సమీక్ష
http://teblog.kinige.com/?p=4187