-
-
నిమగ్న
Nimagna
Author: Dr. Mythili Abbaraju
Publisher: Chinuku Publications
Pages: 232Language: Telugu
అక్షర గవాక్షం...దృష్టికి పలు కోణాలు తెలియని వారికి, అర్థం కానివారికి కూడా ‘లోచూపు’ ప్రేరణ కలిగిస్తుంది. ఈ సాహితీ మహోత్సవంలో నాకూ వారసత్వం వున్నది. నేనుకూడా ఇలాగే అలజడి పడ్డాను.. అన్న తృప్తిని కలిగిస్తుంది. ఎండిపోయిన నదీసానువుల్లో జీవనఝరిని ప్రవహింపచేస్తున్నప్పుడు నరనరాల్లో ఒక పులకరింత.. ఈ పుస్తకం చదవండి.. మీకూ కలుగుతుంది. “ఇవన్నీ నేను చదవలేకపోయానే” అన్న దిగులు అనుభూతిని అక్షరాల సాక్షిగా అందిస్తుంది మైథిలి.
ప్రాక్టికాలిటీతో, కూడా రావని తెలిసినా మాయాజాలంలో చిక్కుకునే భవ బంధాలు, డబ్బు లెఖ్ఖలమధ్య... నా గుండెల్లో తడి, సవ్వడి, మౌనస్పర్శ అర్థం కాదేమిటి ఎవరికీ? అన్న దిగులు ఏదో పోవాలంటే ఈ పుస్తకంలో దోసెడు అక్షరాలు చదవండి చాలు...మనలో ‘నిప్పచ్చరం’ చెదిరిపోతుంది. ఇది ఏదో ఒక్కరచయిత అక్షరసరళి, ఆలోచనా పరిధి కాదు విశ్వ సాహిత్యంలోకి తొంగిచూడడం... ఆ ఇంద్ర ధనుస్సుల శోభలతో మనలో ఆనందహేల... అక్షరమహోత్సవం... ఆ తరవాత మనం “రుచి” లేని జీవితాన్ని గడపము... ఊహా దారిద్ర్యం నుంచి బైటపడి పోతాము... అంతా సుసంపన్నమే.
- జలంధర

- ₹108
- ₹270
- ₹75.6
- ₹540
- ₹90
- ₹216