• Nikasha - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • నికష (free)

    Nikasha - free

    Pages: 234
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మీ చేతుల్లో ఉన్న గ్రంథం అలా ఎప్పుడైనా చదివి, ఉపయోగం పొందదగిన 'విశ్వధర్మవాణి' సంపాదకీయాల సంకలనం. 'చదివి' అనే గాక 'ఉపయోగం పొందదగిన' అని కూడా అనడం ఉద్దేశపూర్వకమే. కొన్ని రచనలు వినోదం కలిగిస్తాయి, కొన్ని విజ్ఞానాన్ని పెంచుతాయి. కొన్ని ఈ రెండిటిని గాని, ఇందులో ఒకటిగాని అందించి బుద్ధిని వికసింపజేస్తాయి కూడా. 'పంచతంత్రం' అలాంటిదే. 'ఆధ్యాత్మికం' పరిధిలోకి వచ్చే కొన్ని రచనలు బుద్ధి వికాసానికి దోహదపడటంతోపాటు సమస్యలతో సతమతమవుతున్న మనస్సుకు ఉపాయాలను స్ఫురింపజేయవచ్చు. ఊరట కలిగించవచ్చు. భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం చివర సంజయుడు ..... సంస్కృత్య సంస్కృత్య సంవాదం ఇమం అద్భుతమ్.... ముహుర్ముహుః" అంటాడు. కృష్ణార్జునుల మధ్య సంవాదమే భగవద్గీత కనుక ఒకసారి చదివి అవతల పారేయకుండా మళ్ళీ మళ్ళీ చదవమనే సూచన ఈ మాటల్లో ఉంది. సంస్కృత్య శబ్దాన్ని రెండుసార్లు అనడం కూడా గమనించవలసిన విశేషం. ఎప్పుడు ఏ క్లిష్టసమయంలో ఏ శ్లోకం జ్ఞాపకం వచ్చి ఉపయోగపడుతుందో చెప్పలేము గనుక మొత్తం మళ్ళీ మళ్ళీ చదవాలని ఇందులో ధ్వని. 'సుందరకాండ' పారాయణగ్రంథం కావడంకూడా ఇలాంటి ప్రయోజనం ఉంటుంది కనుకనే. సమస్యకు సూటిగా పరిష్కారాలు లభ్యం కాకపోయినప్పటికీ వెంటనే ఊరట కలిగించి, పరిష్కారానికి మార్గం స్ఫురించే పరిస్థితిని ఈ గ్రంథాలు.. కలిగించవచ్చు.

శ్రీనివాసులు గారు ఈ పుస్తకానికి 'నికష' అని పేరు పెట్టారు. తరచు వినపడే శబ్దం కాదు కనుక కొందరికి అర్థంకాకపోవచ్చు. నికష పదానికి ఒక అర్థం సాన. పదునుపట్టే సాధనం. పుస్తకంలోని వ్యాసాలను చదివిన కొలది బుద్ధి పదును తేలుతుందని ఈ పేరు పెట్టడంలో అంతర్యం కావచ్చు. బుద్ధి మనస్సును నియంత్రించే ఒక సాధనం అన్నారు. శ్రీనివాసులు గారు ఒక సంపాదకీయంలో, మనిషి బుద్ధిజీవి స్థాయినుంచి హృదయజీవి స్థాయికి ఎదగాలని, అప్పుడతడు మహనీయుడు కాగలడని అయన అకాంక్ష. అలాంటి పరిణామానికి ఈ గ్రంథాన్ని మళ్ళీ మళ్ళీ పఠించడం దోహదం చేయవచ్చు.

ధర్మమార్గాన్ని అనుసరించదలచుకొన్న ఎవరికైనా ఇది పఠనీయ గ్రంథం.

- పొత్తూరి వెంకటేశ్వరరావు