-
-
నిదురించే తోటలోకీ.......
Nidurinche Thotaloki
Author: Sripada Swatee
Publisher: Swatee Sripada
Pages: 66Language: Telugu
“ఇన్ని ఇబ్బందులు పడుతూ ఇంత జోవియల్గా ఎలా ఉండగలరు పిన్నీ?” అప్రయత్నంగానే అడిగాను.
“ఇబ్బందులు అని దిగులుపడుతూ మౌనంగా మధనపడితే సమస్యలు తీరతాయా స్వప్నా. చీకటి లోనే వెలుగును వెతుక్కోవాలి. అది వెన్నెలే కానక్కరలేదు, చుక్కల వెలుగయినా చివరకు మిణుగురుల వెలుగైనా అది వెలుగే కదా”
“మీకు నేను కొత్త కదా, ఇవన్నీ నాకు చెప్పడానికి మొహమాటంగా అనిపించలేదా?”
“ఎందుకు మొహమాటం స్వప్నా? నా గురించి నేను చెప్పుకోడాని కెందుకు మొహమాట పడాలి? నేను దాచుకుని ఎవరయినా మాట్లాడే కంటే నేను మాట్లాడటం ఉత్తమం కదా? అయిన దాచుకున్నా, చెప్పినా నిజమయితే మారదుగా”
అంతే.
ఎలా నోరు విప్పానో ఎలా నేను మాట్లాడటం మరచిపోయినట్టు బ్రతికానో, అమ్మను వదిలేసి వెళ్ళిపోయిన నాన్న గురించి, మరో పెళ్ళైన వాడిని రెండో పెళ్లి చేసుకున్న అమ్మ గురించి వాళ్ళిద్దరిమీద నేను పెంచుకున్న ద్వేషం... ఎప్పటెప్పటి నుండో దాచుకున్నవన్నీ మనసు గోడలను బద్దలు కొట్టుకు బయటకు వచ్చాయి.
