-
-
నీడతో యుద్ధం
Nidato Yuddham
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 225Language: Telugu
నేను 'నాస్తిక వాదం' మీద గతంలో 3 పుస్తకాలు రాశాను. అవి, ఇప్పటి దాకా విడి విడి పుస్తకాలు గానే వున్నాయి. ఇప్పుడు, ఒకే సంపుటం అవుతున్నాయి.
ఆ పుస్తకాలు ఇవీ:
1. నాస్తికత్వం - ఒక పరిశీలన
దీని మొదటి ముద్రణ - 1977 జనవరిలో. ఇది ప్రధానంగా గోరా గారి నాస్తిక సిద్ధాంతం మీద వుంది. దానితో పాటు, నాస్తిక పత్రిక అయిన 'నాస్తిక యుగం' మీదా, హేతువాద పత్రిక అయిన 'చార్వాక' మీదా కూడా క్లుప్తంగా వుంది.
2. నాస్తిక వాదం - హేతువాదం - నవ్య మానవ వాదం
దీని మొదటి ముద్రణ - 1980 సెప్టెంబరులో. ఇందులో నాస్తిక వాదంలో భాగంగా గోరా గారి నాస్తిక సిద్ధాంతం మీద మళ్ళీ కొంచెం క్లుప్తంగానూ, 'నాస్తిక యుగం' , 'చార్వాక' పత్రికల మీద కూడా కొంచెం వివరంగానూ రాశాను.
3. నీడతో యుద్ధం!
దీని మొదటి ముద్రణ - 1980 డిసెంబరులో. ఇది, సి.వి.వాదనలకు జవాబుగా రాసినది.
ఈ పుస్తకాల్లో విషయాలన్నీ 'నాస్తిక వాదం' మీద చర్చలే కాబట్టి, ఈ పుస్తకాల్ని ఒకే సంపుటంగా చేస్తున్నాము.
ఈ పుస్తకాలలో చెప్పిందంతా ఏమిటి? - 'మతం' అనేది శ్రమ దోపిడీకి నీడ లాంటిది. 'దోపిడీ' అనే అసలు విషయం మీద దృష్టి పెట్టకుండా దాని నీడ మీద యుద్ధాలు చేస్తే, ప్రయోజనం వుండదు - అని.
ప్రజలు, వర్గ పోరాటలు చేసే క్రమం లోనే, ఆ నూతన చైతన్యం తోనే, నాస్తిక భావాలు నేర్చుకోగలుగుతారు. శ్రమ సంబంధాల గురించి తెలుసుకోవడాన్ని హ్రధాన విషయం గానూ, ప్రకృతి జ్ఞానాన్ని సెకండరీ విషయం గానూ తీసుకోవాలి.
రెంటినీ కలిపే బోధించాలి. కానీ, 'మతాన్ని నిలబెట్టేది శ్రమ దోపిడీయే' అనే విషయం అర్థం చేసుకోకపోతే, ఏ సమాజమూ మతంతో పోరాడ లేదు.
- రంగనాయకమ్మ
