• New York Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 102.6
    114
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • న్యూయార్క్‌ కథలు

    New York Kathalu

    Publisher: Kunaparaju Kumar

    Pages: 290
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

ఎవరు ఏ ప్రాంతం గురించి రాసినా అవి ‘మనుషుల’ కథలు, భౌగోళికంగా, భాషాపరంగా, అభివృద్ధి, ఆయా దేశాల పోరాటాలు, చరిత్రపరంగా భిన్నత్వం, ప్రత్యేకతలు ఉంటాయి. అంతిమంగా మానవ స్పందనలు, హృదయాలు వాటికి మాత్రం ఎల్లలు లేవు. అంతేకాదు ఏ ఊరి, ఏ ప్రాంత కథలయినా సశేషాలే.

ఊదారంగు తులిప్‌ పూలు ట్విన్‌ టవర్స్‌ కూలిపోయిన నేపథ్యంలో రాసిన కథ. ఇందులో ‘జూలీ’ పాత్ర మిస్టరీగానే మిగిలిపోతుంది. ‘బ్రాడ్‌వే’ నాటకంలో జాన్‌ చెప్పిన మాటలు, ‘మిమోసా పుదీకా’లో ‘మిస్‌లీ’, ‘మంచు కురిసిన ఆదివారం’లో మైకేల్‌, వలస వెళ్ళిన ‘వెంకోజీ’ విషాద జీవితం, ‘లిటిల్‌ బుద్ధాస్‌’ నాటకం వెయ్యటానికి పడ్డ ఇబ్బందులు, ఆ నాటకం చిన్నారులమీద చూపించిన ప్రభావం, ‘స్టాట్యూ’ కథ, ‘గురు పౌర్ణమి’లో రచయిత కన్‌ఫెషన్‌, ‘అంత తేలికా నాయనా’లో ఫిలాసఫీ సాధారణ పాఠకులను అంత త్వరగా వదిలిపెట్టవు. ఈ కథలన్నీ నిరాడంబరంగా వుంటాయి. కొంతమందికి ఇలాంటివి కూడా చెప్పవచ్చా అనిపించవచ్చు. వాక్యాల మధ్య చాలా అర్ధాలుంటాయి. ప్రేమ, కళ, మనిషి పయనం, పశ్చాత్తాపం, ఇవన్నీ వ్యక్తులకూ, వారి కుటుంబాలకూ, పరిసరాలకూ ముడి పెట్టటానికి పరిమితం కావనీ, అలా చేయాలనుకున్నా అంతర్గత, బాహ్య శక్తులు మనకి తెలియకుండా పని చేస్తుంటాయని చెప్పిన అనుభవాలివి.

ఎప్పుడూ నిద్రపోని నగరంలోని బతుకు శకలాలివి. ఏకకాలంలో న్యూయార్క్‌లోనూ, తెలుగు లోగిళ్ళలోనూ సాగిపోయే కథనం ఇది. ‘న్యూయార్క్‌’లోని ట్విన్‌టవర్స్‌ కూల్చేయగలరు. అందుకు ప్రతీకారం తీర్చుకోగలరు. మనుషులు కోల్పోయిన వాటిని తిరిగి సృష్టించుకోగలరు. ఈ ప్రయాణంలో మళ్ళీ విధ్వంసం, స్వార్ధ రాజకీయాలు వుంటాయి. చరిత్ర మనుషులకి తీపి, చేదు జ్ఞాపకాలను మిగుల్చుతూనే వుంటుందా? వుండాలా!?

ప్రతి వ్యక్తికీ జీవిత గమ్యం, సాటివారి గురించి ఆలోచించే తత్వం, జ్ఞానం వచ్చేంత వరకూ ఘర్షణలు కొత్త రూపాల్లోకి మారుతుంటాయని చెప్పటం కుమార్‌ అంతరంగంలోని ఒక కోణం అని నాకు అనిపించింది. కథకుడిగా తొలి అడుగులు వేస్తున్నపుడు తడబాటు వుంటుంది. అవి కూడా ఆనందించడానికి ఈ కథలు చదవండి. ముఖ్యంగా న్యూయార్క్‌ వెళ్ళాలనుకునే వారు అక్కడ పరిస్థితులకు అలవాటు పడటానికి ఇదో టార్చ్‌లైట్‌.

- పి. చంద్రశేఖర అజాద్

Preview download free pdf of this Telugu book is available at New York Kathalu