-
-
నెట్టింట్లో మాయాజాలం
Nettintlo Mayajalam
Author: Nalla Sai reddy
Publisher: Nalla Sai Reddy
Pages: 40Language: Telugu
ఈ రచనను - సాంకేతికతకు నిలువుటద్దమైన ఇంటర్నెట్ సోషల్ మీడియా - గురించి ప్రత్యేకించి వ్రాయడానికి రెండు కారణాలు ఉన్నాయి. అంతే తప్ప సోషల్ మీడియానో లేక, వాటి ఉనికిని ప్రశ్నించడానికో, ఉత్సాహపరచడానికో కూడా కాదు. కేవలం చాలా తక్కువ సమయంలోనే ప్రచురితమైన రెండు పేపర్ న్యూస్ ఘటనలే.... అంతే తప్ప మరో ఉద్దేశం లేదు.
14 సంవత్సరాల వయస్సు గల ఒక అమ్మాయి నగరంలోని ఓ ప్రముఖ ప్రాంతం నుంచి అదృశ్యం అయింది. మరో 280 కి.మీ. దూరంలో గల మరో ప్రముఖ నగరానికి చేరింది. 60 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడితో సోషల్ మీడియా ప్రభావం వల్ల ఛాటింగ్ చేస్తూ... తనకు తానుగా చూడని కుర్రవాడని భ్రమించి పోన్ నెంబర్‌తో వెతుకుతూ... చివరికి పోలీసులను ఆశ్రయించి... ఫోన్ నెంబర్ ఆధారంగా అసలు విషయం తెలుసుకున్నాక... తల్లిదండ్రులకు దగ్గరవుద్దా?... భవిష్యత్తు (?)....
మరో సంఘటన కూడా ఇలాంటిదే... ఒక కుర్రాడి మాటలు విని ఇంటి నుండి పారిపోయి వచ్చిన స్కూలు అమ్మాయిని ఆ కుర్రాడు తెలియని ప్రాంతంలోకి తీసుకెళ్ళి పైశాచికంగా... తన స్నేహితులతో సహా...లోబరుచుకున్నా... ఏమీ ఎదురు చెప్పలేక... ఆశ్రయం కోసమనీ అక్కడే చిక్కుకుందంటే... ఇలాంటి వెలుగులోకొచ్చిన వార్తలు ఏ కొన్నో... మిగిలినవన్నీ అధర్మమనే అంధకారంలో కనిపించని మసి మరకలే....
- నల్లా సాయిరెడ్డి
