-
-
నేను నాస్తికుణ్ణి
Nenu Nastikunni
Author: Gora
Publisher: Vasavya Book House
Pages: 51Language: Telugu
ఎవరైనా “నేను నాస్తికుణ్ణి” అని అనుకోగానే వారి ఆలోచనా పద్ధతిలో, జీవనరీతిలో, జీవిత ఆచరణలో ఏమైనా మార్పు వస్తుందా? వస్తే ఎలాంటి మార్పు వస్తుంది? మార్పుకనక రాకపోతే సాంప్రదాయ పద్ధతిని వదలి తాను నాస్తికుణ్ణి అని అనుకోవడంలో అర్థంగాని ప్రయోజనంగాని ఏమి వుంటుంది? తాను నాస్తికుణ్ణి అనుకోగానే తనకు, ఇతరులకు ఆలోచనలోగాని, ఆచరణలోగాని ఏమి తేడా వుందని భావిస్తాడు? ఇలాంటి ప్రశ్నలు చాలా సహజం.
ఇటువంటి ప్రశ్నలను సామాన్య మానవుడు వేసుకుని పరిశీలించుకున్నా చెప్పడానికి ఎంతో వుంటుంది. అలాంటప్పుడు తన జీవితాన్ని అంతటినీ నాస్తికత్వమును నిర్మాణాత్మక జీవిత విధానముగా రూపొందించుటకు కృషిచేసిన గోరావంటి వ్యక్తి చెబితే ఇంకా ఎంతో లోతు, ఎంతో వైశాల్యం వుంటాయి. జీవశాస్త్ర వేత్తగా, ఉపాధ్యాయునిగా, సాంఘిక విప్లవకారునిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, తత్వవేత్తగా, క్రొత్త ఆలోచనలకు కార్యక్రమాలను రూపొందించిన కార్యకర్తగా, ఆ కార్యక్రమాలను తాను ఆచరించి, ఇతరులచేత ఆచరింపచేయుటకు సర్వదా ప్రయత్నించిన ఆచరణ శీలిగా గోరా నాస్తిక సిద్ధాంతమును ప్రవర్తనను ఈ గ్రంథంలో విహంగ దృష్టితో స్థూలంగా వివరించారు.
- లవణం
