-
-
నేను మాత్రం ఇద్దరిని
Nenu Matram Iddarini
Author: Varma Kalidindi
Publisher: Self Published on Kinige
Pages: 64Language: Telugu
చెప్పేదానికి, చేసేదానికి మధ్య గల అంతరం, ఒక వ్యక్తి లోని రెండు రకాల ధోరణులకు, మానసిక స్థితికి అద్దం పడుతుందా అంటే కలిదిండి వర్మ రాసిన ద్వంద్వాలు ఒక నిర్మాణ పద్ధతిలో కనిపిస్తున్నాయి. మొదటి రెండు పంక్తులు "నేనే"-"నేనే" అంటూ పైకి ఒకదానితో ఒకటి పొంతన ఉన్నటుండే రెండు స్థితులను, రెండు దశలను చెప్తాయి. మూడో పంక్తి మొదటి రెండు పంక్తులకు సార్వజనీనమయిన అన్వయ వ్యాఖ్యగా ఒక ప్రకటన చేస్తుంది. ఇక నాలుగో పంక్తి "నేను మాత్రం ఇద్దరినీ" అంటూ మొత్తం మూడు పై లైన్ల భావచిత్రాన్నీ ఒక గొడుగు కింద నిలబెడుతుంది.
ఈ "ద్వంద్వాలు " వర్మ ముందు యింకెవరూ రాసినట్టుగా లేదు ఈ చిన్ని రూపంలో, మొత్తం సమాజ వైరుధ్యాలను, మనిషి మనసులోని ఎత్తు పల్లాలను కవి చూపగలిగాడు. ఇందుకు ఈ విధమైన రూపావిష్కరణకు, భావావిష్కరణకు యువకవి వర్మ అభినందనీయుడు.
తనదంటూ ఒక ముద్రతో వస్తున్న కలిదిండి వర్మ రూపాన్ని, భావాన్ని పట్టించుకుని, తృతీయ సహస్రపు తెలుగు కవిలోకంలో నిలబడే సత్తువను పది కాలాలు పదిల పరుచుకొంటాడని ఆశిస్తూ అతని కవిత్వపు కలిమికి శుభాభివందనాలు.
- రామతీర్ధ
