-
-
నేను క్యాన్సర్ని జయించాను
Nenu Cancerni Jayinchanu
Author: Tejarani Tirunagari
Publisher: Manrobo Publications
Pages: 69Language: Telugu
Description
ఒక సాధారణ మహిళ... ఒక ఉద్యోగిని... తను తన కుటుంబం... సాఫీగా సాగిపోయే ప్రశాంత ప్రయాణంలో క్యాన్సర్ అనే వడగాలి సుడిగాలిలా ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒంటరిని చేసింది. ఆ క్షణం ఆమెలోని ఎన్నో అంతర్మధనాలు... డాక్టర్ ఆమెను అన్ని పరీక్షలు చేసి చెప్పిన ఒకే ఒక మాట... మీకు క్యాన్సర్... ఆమె ప్రపంచాన్ని ఒక్కసారిగా విషాదం అనే సునామీ చుట్టేసింది. అప్పుడు ఆమె ఏం చేసింది..... ?
- ప్రచురణ కర్తలు
Preview download free pdf of this Telugu book is available at Nenu Cancerni Jayinchanu
అమ్మా !
నమస్కారం
మీరు రాసిన పుస్తకం " నేను క్యాన్సర్ ని జయించాను " చదివాను.మనస్సు భారమైంది.మా అమ్మగారు క్యాన్సర్ తోనే కాలం చేసారు. మీరు క్యాన్సర్ ని ఎలా ఎదుర్కొన్నారో చదువుతుంటే కన్నీళ్ళొచ్చాయి.ఇలాంటి పుస్తకం ఆ రోజుల్లో ఉంటే మా అమ్మగారికి ,మాకు ఎంతో ధైర్యంగా ఉండేది.,
" మీలా మరొకరు ధైర్యాన్ని కోల్పోవద్దని " ఈ పుస్తకాన్ని రాసిన నేపథ్యం బావుంది.మీ తలవెంట్రుకలు రాలిపోతున్నప్పుడు మీరు పడ్డ బాధ,మీ అమ్మగారి ఆవేదన మీ అక్షరాల్లో ప్రస్ఫుటమైంది.
మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలి.
ఈ పుస్తకాన్ని ప్రతీఒక్కరూ చదవాలి.జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలి.దురదృష్టవశాత్తు క్యన్సర్ బారిన పడితే " ఆ క్యాన్సర్ ని " తరిమివేసేందుకు ఈ పుస్తకం దోహదం చేస్తుంది.
క్యాన్సర్ తో పోరాడి గెలిచి,తన గెలుపును ఇతరులకు స్ఫూర్తిని ధైర్యాన్ని కలిగించేలా " నేను క్యాన్సర్ ని జయించాను " పుస్తకాన్ని రాసిన తేజారాణి తిరునగరి గారు అభినందనీయులు.
ఈ పుస్తకం ఎందరికో ధైర్యాన్ని ఇస్తుంది .
క్యాన్సర్ మీద మీరు చేసిన పోరాటానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాం.ఒక రచయిత్రిగా బాధ్యతగా ఈ పుస్తకాన్ని రాయడం మీ గొప్పతనం.చాలా మంచిపుస్తకం.
నేను క్యాన్సర్ ని జయించాను పుస్తకాన్ని చదివితే ఒక జీవితాన్ని చదివినట్టు వుంది.గుండె బరువెక్కింది .క్యాన్సర్ ని ఎదిరించి మనోనిబ్బరంతో జయించి.తనలా క్యాన్సర్ తో బాధపడేవారికి ధైర్యాన్ని ఇచ్చేలా పుస్తకాన్ని రాసిన తేజారాణి తిరునగరిగారికి నమస్సుమాంజలి .
ప్రతీఒక్కరూ చదువవలిసిన పుస్తకం ఇది
మీరు రాసిన పుస్తకం నేను క్యాన్సర్ ని జయించాను చదువుతుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి.ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో క్యాన్సర్ ను జయించారు.మీ ధైర్యాన్ని పాఠకులకు కూడా ఈ పుస్తకం ద్వారా పంచారు.చక్కని భాష చక్కని భావ వ్యక్తీకరణ.ధన్యవాదాలు అభినందనలు.