-
-
నేనే బలాన్ని సదాలక్ష్మి బతుకు కథ
Nene Balanni Sadalakshmi Batuku Katha
Author: Gogu Shyamala
Publisher: Hyderabad Book Trust
Language: Telugu
సదాలక్ష్మి - ఓ పొద్దుచుక్క
భారతదేశంలోని వర్ణాశ్రమ ధర్మపు నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో అట్టడుగు కులాలన్నింటిలోను అడుగున ఉండే మాదిగ ఉపకులమైన, మరుగుదొడ్లు సాఫు జేసే 'మెహతర్ ' వృత్తి కులంలో పుట్టి... ఏటికి ఎదురీదుతూ.. మంత్రివర్గ సభ్యురాలిగా, డిప్యూటి స్పీకర్ స్థాయికి చేరుకున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా రాష్ట్ర రాజకీయ వ్యవస్థపై బలమైన ముద్ర వేసారు సదాలక్ష్మి.
దేవాదాయ శాఖలో ఈమె నిర్ణయాలు విప్లవాత్మకం. 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నిర్మాణానికి ఈమె మూల స్తంభం. ఈమె పునాదులు వేసిన మాదిగ 'దండోరా' ఉద్యమం దళిత చైతన్యంతో, ఉత్పత్తి కులాల రాజకీయ అవగాహనలో కొత్త ఉరవడి సృష్టించింది.
జీవితాంతం కాంగ్రెస్, తెలుగుదేశం వంటి అధికార పార్టీ రాజకీయాల్లో కీలకంగా ఉంటూ కూడా ఉద్యమాలలో మమేకమై ... తన జాతి, ప్రాంత, జండర్ అస్తిత్వాల కోసం పోరాడడం; అస్తిత్వ రాజకీయాలు, సాంస్కతిక తాత్విక భావజాలాలు ఉద్యమ స్థాయిలో స్థిరపడేలా తొవ్వలేయడం సదాలక్ష్మి ప్రత్యేకత.
అయినా నేరపూరిత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా సాగిన ఈమె కృషి మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదు. ఇంటా బయటా హిందూ బ్రాహ్మణీయ వర్ణ పితృస్వామ్య నియంత్రణలను ధిక్కరించి... నిజమైన సాధికారతతో దళిత స్త్రీ శక్తిని చాటి చెప్పిన ఈ పాత్ర... చరిత్రలో మరుగుపరచబడింది. అందుకే ' అడుగడుగునా నాకు చరిత్ర ఉన్నదని ' బలంగా ఎలుగెత్తి ప్రకటించింది సదాలక్ష్మి. ఆమె బతుకు కథే ఈ పుస్తకం!
ఈ పుస్తకం గురించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగుపై http://hyderabadbooktrust.blogspot.com/2011/08/blog-post.html