• Negadu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నెగడు

    Negadu

    Pages: 90
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేనేం కోల్పోయానో
తెలుసుకునే లోపే
అన్నీ కోల్పోయాను

ఏం చేయాల్నో
తేరుకునేలోపే
నా చేతులు కట్టివేయబడ్డయ్
నా కాళ్ళు కర్రబిగుసుకున్నయ్

దారులన్నీ మూసుకు పోయాక
నేనొక సెల్ఫ్ బాండెడ్ బందీని
జనగణనలో నేనొక టోకెన్ నెంబర్నీ

నాకు గొంతుంది
మాట్లాడడానికీ ఐనా...
మాట్లాడితే
గోదారి ఒడ్డునున్న
పంటపొలాల నెర్రెలా
గుండె పగిలిపోతుంటది

నాకు పాటుంది
పాడటానికి
పాడితే
మూగబోయిన అజంజాహీ మిల్లులా
నా పాట కబలించబడుతుంటది

నేను దగాపడ్డ వరంగల్ బిడ్డను
నాలాగే నా తెలంగాణ

Preview download free pdf of this Telugu book is available at Negadu