-
-
నీవేనా
Neevena
Author: Oddiraju Brothers
Publisher: Palapitta Books
Pages: 66Language: Telugu
ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించిన సకల ప్రక్రియల్లో విశిష్టమైన కృషి చేశారు ఒద్దిరాజు సోదరులు. వారి సృజనాత్మక ప్రతిభ అనన్యం. తెలంగాణ వైతాళికులయిన వీరి కృషి మీద సమగ్రమైన పరిశోధనలు, అధ్యయనాలు జరగాల్సిన అవసరముంది. ఒద్దిరాజు సోదరుల సాహిత్య వ్యాసంగం ఐక్యంగానే కొనసాగింది. అయినప్పటికీ ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరి విశిష్టత వారిదే. కొన్నిసార్లు ఇద్దరి పేర్లతోనూ, కొన్ని సార్లు సీతారామచంద్రరావు గారి పేరుతోనూ, మరికొన్నిసార్లు రాఘవ రంగారావు గారి పేరుతోనూ వారి రచనలు అచ్చయ్యాయి. ఈవిధంగా అచ్చయిన వాటిలో 'నీవేనా', 'లండన్ విద్యార్థి' కథలు ఎంతో విశిష్టమైనవి. వీటిని ఒద్దిరాజు రాఘవరంగారావు గారు రచించారు. ఈ రెండునూ సుజాత పత్రికలో అచ్చయ్యాయి. అలాగే వారు రాసిన కొన్ని కవితలు, పద్యాలు సైతం సుజాత పత్రికలో ప్రచురితమైనాయి. వారు చేసిన అనువాదాలు కూడ కవిత్వ పాఠకుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. 'జేబున్నిసా ఖాసమ్ పద్యావళికి తెలుగు ఛాయగా' చేసిన అనువాదం రసరమ్యమైన రీతిన సాగింది. అసామాన్యమైన వారి ప్రతిభకు దర్పణం పట్టే ఈ రచనలు ఇదివరకు పుస్తకరూపంలో రాలేదు. కనుక 'నీవేనా?' శీర్షికన ఇప్పుడు కథల్ని, కవిత్వాన్ని, పద్యాల్ని, అబెస్సినియా దేశపు చరిత్రను ఈ పుస్తకంగా అందిస్తున్నాం.
చరిత్ర మీద, చరిత్ర పరిశోధన మీద రాఘవరంగారావు గారికి గల ఆసక్తిని తెలియజెప్పే రచన ఇది. సృజనాత్మకంగా ఆలోచించడం, కొత్తదనం కోసం తపించడం ఒద్దిరాజు సోదరుల స్వభావం. అందుకు అనువుగానే వారి నిరంతర కృషి కొనసాగింది. అనేక రంగాల్లో తమదైన ముద్ర వేశారు. సాహిత్య కళా రంగాల్లో పనిచేసేవారికి ఉండల్సిన క్రమశిక్షణ, అంకితభావం ఎలాంటిదో తమ జీవితాచరణ ద్వారా చూపారు. సృజనాత్మకంగా జీవించాలనుకునేవారికి తగిన స్ఫూర్తిని, ఉత్తేజాన్ని ఇస్తుంది ఒద్దిరాజు సోదరుల జీవితం, సాహిత్యం. ఆ సాహిత్యం లోని మేలిమిని ఆకళింపు చేసుకోడనికి వారి సాహిత్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఈ పుస్తకాలు అందుకు ఉపకరిస్తాయని ఆశిస్తున్నాం.
- పాలపిట్ట బుక్స్
