• Neeve Nenai Nene Neevai
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 189.6
    210
    9.71% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నీవే నేనై నేనే నీవై!

    Neeve Nenai Nene Neevai

    Pages: 197
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అంత ఘాటైన ప్రశ్నకి జవాబుగా కేవలం నిర్ఘాంతపోయిన నిశ్శబ్దం అలముకుంది. ఆ నిశ్శబ్దాన్ని ఒకేసారి సంజీవరావు, హేమలతలు భంగపరిచారు. సంజీవరావయితే గొంతులో పచ్చగడ్డి యిరుక్కున్న గొర్రెలాంటి చప్పుడు చేశాడు. హేమలత మాత్రం మాట్లాడగలిగింది.
“ఏం కథ?” వస్తున్న కెవ్వుకేకని గట్టిగా గుప్పెట్లు మూసి ఆపుచేసింది.
“అదే, చిన్నప్పుడు తను పిల్లల్ని తారుమారు చేసిన విషయం.”
ఏమాత్రం ఆవేశం చూపకుండా, “తను చెప్పేసిందా నీకు?” అని చందూ అడిగాడు. “అవును.”
“ఆవిడకి శాస్తి జరగాలి!” అంటూ సంజీవరావు అరిచాడు. “అలా చిలవలు, పలవలు కల్పించి నీకు చెప్పేందుకు ఆమెకి హక్కు ఏముందసలు?”
దానికి ఇందూ, “నేనా సమయంలో అక్కడ వున్నందుకే అనుకుంటా. ఈ విషయం ఎవరికైనా సరే చెప్పుండేదామె. రాజారాం అంటే నేను యిష్టపడతానని తెలుసావిడకి,” అని చెప్పింది.
నమ్మశక్యం కానట్టు, “అతనంటే నీకిష్టమా?” అని శీను అడిగాడు.
“అవును. ఎందుకు చెబుతున్నానంటే నేనిది యిప్పటికిప్పుడు కల్పించి చెబుతున్నది కాదని మీరంతా తెలుసుకోవాలని. రాజారాం అంటే నాకు చాలా యిష్టం. నేనతని షాపులో చేరినప్పుటినించి నాతో చాలా చక్కగా ప్రవర్తించాడు. మరో విషయం గుర్తుపెట్టుకోండి, అలాంటి షాపులో పని చేసే ఆడపిల్లల్ని అంత గౌరవంగా చూసేవాళ్ళు చాలా తక్కుమందుంటారు. రాజారాం ఎప్పుడూ నాతో చక్కగా మసలుకుంటాడు, అందుకే అతను ఎప్పటికీ సంతోషంగా వుండాలని నేను కోరుకుంటాను.”
సంజీవరావు గట్టిగా వూపిరి పీల్చి వదిలాడు.
“అదంతా బాగానే వుందమ్మాయ్, కాని, జమీందార్ చంద్రశేఖరవర్మ ... ”
“అందుకే చెబుతున్నాన్నేను, యిందులో ఏమాత్రం నిజం వున్నా, నాకోసమన్నా రాజారాంకి తెలియపరచకుండా వుంటే మంచిదనిపిస్తోంది,” అని ఇందూ అన్నది.
“ఏమిటీ!” “రాజారాంకి చెప్పవద్దంటున్నావా?”
“రాజారాంకి చెప్పవద్దని అన్నావా నువ్వు?” అంటూ శీను గట్టిగా అరిచాడు. “వద్దనేనా నువ్వన్నది?”
ఇందూ ప్రశాంతంగా చెప్పసాగింది.
“రాజారాం స్వతహాగా చాలా ఆనందంగా వుండే వ్యక్తి. తన వృత్తి గురించి అతనికి చాలా చాలా అభిమానం, పైగా షాపు చక్కగా నడుస్తున్నందుకు చెప్పలేనంత సంతోషంతో వున్నాడు. ఎప్పుడో ఒకరోజు పెద్దబజార్లోకో, మరోచోటికో మార్చాలని చెప్పడం వినితీరాలి. పసిపిల్లాడు పార్టీ యివ్వడం లాగా అన్నమాట. నా మటుకు నాకైతే అతను యిప్పుడున్న చోటులోనే తగినవాడని నా అభిప్రాయం. అతని మనసు, ఆత్మ తను చేస్తున్న వ్యాపారంలోనే నిమగ్నమైంది. వున్నట్టుండి అకస్మాత్తుగా మీరతనికి ఈ జమీందారీ, దాంతో వచ్చే బిరుదు అంటగడితే అతని ప్రవృత్తి దెబ్బతింటుంది.”

Preview download free pdf of this Telugu book is available at Neeve Nenai Nene Neevai