• Neeti Chukkalu Neti Raitu Vetalu
 • Ebook Hide Help
  ₹ 60 for 30 days
  ₹ 216
  240
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • నీటి చుక్కలు.. నేటి రైతు వెతలు!!

  Neeti Chukkalu Neti Raitu Vetalu

  Publisher: Raitu Nestam

  Pages: 446
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

ప్రజాహిత పాత్రికేయ బాధ్యతల్లో 50 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ ఆధునిక తెలుగు జర్నలిజానికి మార్గ నిర్దేశం చేసినవి మూడే మూడు స్థిరాక్షరాలు - అవే ఎ.బి.కె.

1935 ఆగస్టు 1న జన్మించిన డాక్టర్‌ ఎబికె ప్రసాద్‌ కృష్ణా జిల్లా ఉప్పులూరు వాసి. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల ప్రజల మనస్సుల్లో విశ్వమానవుడిగా, కులమతాలకు అతీతంగా ఎదిగిన వ్యక్తి. ఆయన దృష్టి సామాజికం, సృష్టి నిత్య చైతన్యశీలమైన రచనా వ్యాసంగం, ఆలోచనా దృక్పథం అభ్యుదయం. ప్రయోగాలలో సాహసం, నిర్వహణలో నిర్భయం. ఈ గుణగణాలతో తెలుగు పత్రికా రంగానికి నిరంతర అభ్యుదయ దృష్టి, జనాకర్షణ, కొత్తదనం కల్పించిన పాత్రికేయ శిల్పి ఎబికె. ఆయన సారథ్యంలో పత్రిక రూపం మారింది, వేషం మారింది, గుణం మారింది, తత్వం మారింది. నిలువెల్లా ఆధునికత సంతరించుకుంది. కమర్షియల్‌ వాల్యూ పెంచుకుంది. ఇందుకు చెరగని గుర్తులు - ఈనాడు, ఉదయం, వార్త, ఆయన చేతుల మీదుగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌, తిరుపతి ఎడిషన్లు, 'ఆంధ్రభూమి', 'ఆంధ్రప్రభ', విశాలాంధ్ర, జనశక్తి దినపత్రికలు. సుప్రభాతం, మా భూమి లాంటి వార, పక్ష పత్రికలూ పాఠకుల్ని రంజింపజేశాయి. రాష్ట్రవ్యాపితంగా దేశరాజధానిలోనూ అనేక సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు.

అందుకున్న పురస్కారాలు: 1975లో కలకత్తాలో అఖిల భారత బహుభాషా సమ్మేళనంలో ''పత్రకార్‌ శిరోమణి'', హైదరాబాద్‌ సాహితీ సంస్థలు ''కిన్నెర'', ''త్రిపుర్నేని'' దశాబ్ది సంపాదకునిగా బంగారు పతకం (1986); జి.కె. రెడ్డి జాతీయ స్థాయి పురస్కారం, ప్రధాని దేవెగౌడ నుంచి బంగారు పతకం (1997), ''నార్ల అవార్డు'' (1980), ఉత్తమ రచనలకు తెలుగు విశ్వవిద్యాలయం తాపీ ధర్మారావు ధర్మనిధి పురస్కారం (1990లో), జాతీయ సమైక్యతా రచనలకు ''హార్మొనీ అవార్డు'' (1995 ఢిల్లీ); కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ (1998); ''సంపాదకరత్న'' అవార్డు, అకాడమీ ఆఫ్‌ ఫైనార్ట్స్ (రైల్వే కోడూరు); తెలుగు విశ్వవిద్యాలయం లిటరరీ అవార్డు (2002); ''ఆరాధన'' పురస్కారం (2001, హైద్రాబాద్‌); వీరేశలింగం జర్నలిజం అవార్డు (రాజమండ్రి, 2002); ''రాష్ట్రీయ వికాస్‌ శిరోమణి'' (2003, ఢిల్లీ తెలుగు అకాడమీ); ''హరివంశరాయ్‌ బచ్చన్‌ అవార్డు'' (బొంబాయి, 2004); లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు'' (ఇండియన్‌ ప్రెస్‌ కౌన్సిల్‌, 2004); మలేషియా తెలుగు ప్రపంచ మహాసభ పురస్కారం (2006); తాపీ ధర్మారావు లైఫ్‌ టైమ్‌ అవార్డు (2007, యువ సాహితీ మిత్రుల సంస్థ ''పరంపర''); సురవరం ప్రతాపరెడ్డి అవార్డు (2007); ''భాషాకౌముది'' అవార్డు (ఒంగోలు రచయితల సంఘం); ''తానా'' అవార్డు (2010); ''విశిష్ట భూమి పుత్ర'' (గ్రేట్‌ సన్‌ ఆఫ్‌ ది సాయిల్‌) అఖిల భారత మేధావుల సమ్మేళనం తరఫున హర్యానా గవర్నర్‌ డాక్టర్‌ కిద్వాయ్‌ పురస్కారం (2009); ఖాసా సుబ్బారావు అవార్డు (2000, మద్రాస్‌ తెలుగు అకాడమీ); కళా సాగర్‌ అవార్డు (2001, మద్రాస్‌); కేంద్ర సాహిత్య అకాడమీ రాష్ట్ర మండలి, తెలుగు విశ్వవిద్యాలయం భాషా సలహా మండలి సభ్యుడు, నాగార్జున, పద్మావతి విశ్వవిద్యాలయాల జర్నలిజం డిపార్టుమెంట్‌ ఆఫ్‌ స్టడీస్‌ సభ్యులు, డి.ఎన్‌.ఎస్‌. జర్నలిజం కళాశాల గవర్నర్ల బోర్డు సభ్యులు, 1965-1966 జూన్‌ రాజకీయ డిటెన్యూ, 'జనశక్తి' సంపాదకునిగా; 1969-70 పార్వతీపురం కుట్ర కేసు బనాయింపు, నిర్దోషిగా కోర్టు తీర్పు, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం పూర్వాధ్యక్షులు.

Preview download free pdf of this Telugu book is available at Neeti Chukkalu Neti Raitu Vetalu