• Neeli Akupacha
  • fb
  • Share on Google+
  • Pin it!
 • నీలీ - ఆకుపచ్చ

  Neeli Akupacha

  Author:

  Publisher: J.V.Publications

  Pages: 204
  Language: Telugu
  Rating
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  '4/5' From 1 votes.
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  '4/5' From 1 premium votes.
Description

నేను అరిచిన అరుపు నాకే వినపడుతోంది... ప్రాణభయంతోనూ, వినాశనం తప్పదనే భీతితోనూ బొంగురు గొంతుతో చేసిన ఆర్తనాదం అది. పరిగెత్తి పారిపోవాలని ప్రయత్నించాను, కాని కదల్లేకపోయాను. ఎలాగోలా పరిగెత్తాను.. కానీ ఉన్నచోటనే ఉన్నాను. మంత్రోచ్చారణతో వాటిని నిలువరించాలనుకున్నాను.... కానీ నోరు పెగలడం లేదు. అవి భయంకరమైన జీవులు. ఒళ్ళంతా నల్లటి జూలు... నాలుగు కాళ్ళతో పరిగెడుతున్నాయి. వాటి కాలి వేళ్ళకి పదునైన పంజాలు, కోరపళ్ళు ఉన్న నోటి వెంట చొంగ.. ఎర్రటి కళ్ళలో పగ! ఈ జంతువులు భూలోకానివి కావు... వాటిని చూడగానే అర్థమైంది అవి నా అంతు చూడడానికే పంపబడ్డాయని.

ఆ పరిసరాలన్నీ నాకు మునుపే తెలిసున్నట్లు అనిపిస్తోంది.. పెద్ద పెద్ద బండరాళ్ళు, ఎర్రటి దుమ్మూ ధూళితో నిండిన లోతైన లోయలూ ఉన్న ఎర్రటి నేలలు... వివర్ణమైన, అంధకారమైన ఆకాశం.. చెట్లు చేమలు లేని నేల.. దూరంగా ఉన్న ఎర్రని కొండల పైభాగంలో అక్కడక్కడ ఆకుపచ్చని పాచి మాత్రం కనబడుతోంది. నేను పరిగెడుతున్నాను... పరుగెడుతూనే ఉన్నాను... రొప్పుతున్నాను, మూలుగు మాత్రం నోట్లోంచి బయటకి రావడం లేదు. ఆ జంతువులు నా మీద పడి నన్ను చీల్చుకు తిన్నాయి.. లేదా అవి నన్ను చీల్చేసాయని నాకు అనిపించిందో... వెంటనే నేను ఓ శక్తివంతమైన మంత్రాన్ని.. ఓ పరాయి భాషలో... పలికాను.

''నిశ్చలో భవ!... మరణం ప్రాప్తిరస్తు...'' అనే అర్థంలో!

Preview download free pdf of this Telugu book is available at Neeli Akupacha
Comment(s) ...

గభాగం తెలుసుకోకుండా రెండో దానికి వెళ్ళలేము. అసలు మొదటి భాగమైన “కుజుడి కోసం” లో కధేంటో టూకీ గా తెలుసుకుందాం. అంగారక గ్రహయాత్ర ని ముగించుకొని హాని ఆమ్రపాలి భూమి మీదికి తిరిగివస్తాడు. సయోనిపై మోజుతో మరల అంగారక గ్రహానికి వెళ్ళినా హాని కి భ్రమలు తొలిగిపోతాయి. అరుణ భూముల చక్రవర్తి అయినా సమూరా చేతి లో బందీ అవుతాడు. కుజుడి మీద ఉన్న ఒలంపస్ శిఖరం మీద దాచబడి ఉన్న అమరత్వం ప్రసాదించే ఔషదాన్ని తెచ్చి తనకివ్వాలని సమూరా!. ఎలాగోలా దాన్ని తెచ్చి ఇస్తాడు హనీ. ఆ తరువాత మానవ కాలనీకి, మాంత్రిక రాజ్యం అరుణ భూములకి మధ్య ఎప్పట్నుంచో ఉన్న వైరం అకస్మాత్తు గా యుద్ధ రూపంలోకి మారడంతో హనీ యుద్ధం చేస్తాడు. కుజ గ్రహపు మాంత్రికుల వద్ద శిక్షణ పొంది విశ్వశక్తిని కరతలామలకం చేసుకుంటాడు హనీ.
ఈ క్రమంలోనే తనలో జన్యు సంబంధమైన ప్రత్యేక శక్తి ఉంది అని, అది తనకి పుట్టుకతోనే లభించింది అని తెలుసుకుంటాడు. అమృత ఔషధం తాగితే శక్తులు నశిస్తాయన్న నిజాన్ని దాచి పెట్టి, సమూరా ఆ ఔషధాన్ని సేవించేలా చేస్తాడు హనీ. దాంతో విశ్వాన్ని జయించాలన్న తన ఆశయం నెరవేరక పోయేసరికి హనీ మీద పగ పడతాడు సమూరా ..కుజుడి మీద మానవులకి, అరుణ భూముల పాలకులకి, మధ్య సంధి కుదిర్చి అరుణ భూములకు తన స్నేహితుడు మీరోస్స్ ని ప్రభువుగా చేస్తాడు హనీ..కుజ గ్రహం మీద మానవులు హనీ ని సత్కరిస్తారు. కాని చివరికి వాళ్ళు కూడా హనీని అనుమానించి వెంటాడతారు. గురుడి ఉపగ్రహం గ్వానిమోడ్ నుంచి వచ్చిన ఎనిమోయిడ్ (Yenimoid) ని మానవ సైనిక అధికారి జనరల్ గ్యని అశ్వశాల నుంచి రక్షించే క్రమం లో మానవులకి శత్రువు అవుతాడు …ఎలాగోలా తప్పించుకొని భూమి చేరుతాడు. తిరిగి వచ్చాక ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో బయో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం లో అధ్యాపకుడి గా తన ఉద్యోగంలో కొనసాగుతుంటారు. అయినా గ్రహాంతర దుష్ట మాంత్రికులు వెంటాడుతుంటారు…వీరే కాకుండా ఎర్త్ కౌన్సెల్ వాళ్ళు కూడా హనీ ఆమ్రపాలి కి అడ్డు తగులుతూనే ఉంటుంది. భూమి మీద విశ్వశక్తి ని ప్రయోగించడం నిషేధించిన కారణం గా ఎర్త్ కౌన్సెల్ ని ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది.
“కుజుడి కోసం” నవలకిది అద్భుతమైన కొనసాగింపు. ఈసారి కధా స్థలం భూమి

https://www.facebook.com/photo.php?fbid=10205339900359792