-
-
నీలాగే ఒకడుండేవాడు
Neelage Okadundevaadu
Author: Nanda Kishore
Publisher: Self Published on Kinige
Pages: 180Language: Telugu
Description
కల్లోలాన్ని అనుభవిస్తూ
ఒక్కడూ ఏం చేస్తాడు?
తీరాన కూర్చుని
కెరటాల్ని గురించి కవిత్వం రాస్తాడు.
అలల మీదా నీటి తరగల నాట్యం మీదా
పదాలు అల్లుతూ పాటకడతాడు.
ఉప్పెన మీదకి వచ్చి ఊపిరి సలపకుండా చేస్తే
చేపపిల్లలాగా తుళ్ళిపడతాడు.
అలలతో పాటే ఊపిరికూడా పోతే
ఇసుకలో గవ్వలా దాగిపోతాడు.
సముద్రం వాన్ని ప్రేమించిందని
ఎవ్వరికీ చెప్పడు.
కల్లోలాన్ని వాడు కోరుకున్నట్టు
ఎప్పటికీ తెలీదు.
తెలిసేదల్లా వాడికలేడనే!
Preview download free pdf of this Telugu book is available at Neelage Okadundevaadu
ఇంతకుముందు మీకు తిలక్ ,ఠాగూర్ ,బైరాగి వంటి వారి కవిత్వాలు చదివుంటే అలాంటి ఒక నిండు పున్నమి లాంటి కవిత్వం ..ఒక కొత్త యువ కెరటం నంద కిషోర్ గారు ... ఇలాంటి కవులు చాలా తక్కువ ఉంటారు ఇలా ప్రతి పదం లో కవిత్వాన్ని చూపించే వాళ్ళు .. తప్పక చావాల్సిన పుస్తకం.......
next book??? nandakishor garu..
waiting....
నాకు కవిత్వం చదవడం, అలా చదివిన కవితలలో కదిలించిన/ఆకట్టుకున్న కవితలను మిత్రులతో కలిసి మళ్ళి చదవడం ఒక అలవాటు. చాలాకాలం తరువాత ఈ తరం/మా తరం లో ఒకరైన "నంద కిషోర్" గారు తెచ్చిన/వ్రాసిన ఈ కవిత్వ సంకలనంలో చాలా కవితలు నన్ను కదిలించాయి/ఆలోచింపచేసాయి.
మరిన్నీ కవితా సంకలనాలు మీరు ప్రచురించాలని ఆశిస్తూ....!
కవికుమారుడి గోస – ‘నీలాగే ఒకడుండేవాడు!’ పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=4222
Nice book indeed. భాషతోనే చాలా సమస్యలున్నాయ్. కానీ భావ వ్యక్తీకరణ, శైలి, అన్నీ కొత్తగా చదవాలనిపింపజేసేవిగా ఉన్నాయ్. more thoughts on this book @
http://www.madhumanasam.in/2013/12/blog-post.html