-
-
నీల
Neela
Author: K.N. Malleeswari
Publisher: TANA Prachuranalu
Pages: 590Language: Telugu
నీల స్వేచ్ఛని మాత్రమే కాదు. సాహచర్యాన్ని కూడా కోరుకుంది. తన జీవితంలో వరసగా ప్రవేశించిన ముగ్గురు పురుషులు- ప్రసాద్, పరదేశి, సదాశివలతో ఆమె ప్రతిసారీ కోరుకున్నది సాహచర్యాన్నే. నిజమైన సాహచర్యాన్ని తాను వాళ్లతో ఏమి కోరుకుంటున్నదో తెలుసుకోవడానకి ఆమె తన చుట్టూ ఉన్న స్త్రీ పురుష సంబంధాల్లో ఏది లేదో తెలుసుకుంటూ వచ్చింది. తన తల్లి, సంపూర్ణ, అజిత, నీతాభాయి, వసుంధర వంటి వాళ్లందర్నీ దగ్గర్నుంచి చూశాక ఆమెకి తెలుస్తూ వచ్చిందేమంటే, జీవితానందానికి స్వేచ్ఛ కావాలి. కాని, స్వాతంత్ర్యం లేకపోవడం ఎంత ప్రమాదకరమో, సాహచర్య సంతోషాన్ని భగ్నం చేసే స్వేచ్ఛ కూడా అంతే ప్రమాదకరమని.
- వాడ్రేవు చినవీరభద్రుడు
తొలినాళ్లలో నీల జీవితానికి నిశ్చితమైన నిర్దిష్ట గమ్యాల్లేవు. ఆమె జీవితం ఆమె చేతుల్లో లేదు. ఆమెకి తెలియకుండానే జారిపోయినదాన్ని వొడిసి పట్టుకొని తనకు నచ్చిన రీతిలో దిద్దుకొనే క్రమంలోనే తనను తాను తెలుసుకోగలిగింది. చదువుకొంది. సొంత కాళ్ల మీద నిలబడింది. తనని బాధించే హక్కు యెవరికీ లేదు. అదే సమయంలో తాను యెవరి బాధకీ కారణం కాకూడదు అన్నదే ఆమె తన జీవితతత్త్వంగా మార్చుకొంది. ఒక విధంగా నీల స్వీయ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, స్వేచ్ఛ కోసం చేసిన పెనుగులాటే ఆమె గమనం. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. 'ఆడా మగా సంబంధాల్లో సార్వకాలికమైన సార్వజనీనమైన విలువలేమీ ఉండవని,’ తెలుసుకుంది. భయాల సంకెళ్లు తెంచుకుంది.
- ఎ.కె. ప్రభాకర్

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE