• Neeko Lekha - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • నీకోలేఖ (free)

    Neeko Lekha - free

    Author:

    Pages: 85
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతివారికీ జీవితంలో ప్రేమ, అంతర్భాగమై పెనవేసుకుపోయి ఉంటుంది. ఒక సహజమైన హృదయానికి స్వరముంటే, అది ప్రేమను వేయింతలు చేస్తుంది. అయితే ప్రేమను అన్నివేళలా వ్యక్తీకరించడం కొందరికి సాధ్యమైనా, నిజానికి ఒకింత అతిశయం అనిపించుకుంటుంది. ఒక ఎడబాటు కలిగితేనో, ఒక మౌనం ముసిరితేనో, ఆ భావానికి మరింత స్పష్టత కలిగి, హద్దులేని ప్రేమయత్వం బయటపడుతుంది. వీటిని అక్షరీకరించడమే ప్రేమలేఖల సారాంశం కాగా, మదిలో సంగీతం..సంద్రమూ పోటీపడి ప్రవహిస్తూ గుండెను తడిపి మరీ పలకరిస్తాయి.

మానసిక ప్రపంచం సృష్టించుకున్న వారికి దేహాన్ని మించినదేదో పరివేదన ఉండి ఉంటుందని నా అభిప్రాయం. అవి మాటల్లో అవ్యక్తమై కాగితాన్ని కౌగిలించి గుబులు తీర్చుకుంటాయి. ప్రేమే సంకల్పం అయినప్పుడు అక్షరం చేసే సాయం ఆర్ద్రమై అమరమవుతుంది. భావోద్రేకాలూ, కల్పనాతీతాలు నిజానికి సరయిన సాహచర్యంలోనే సాధ్యపడతాయి. చాలా సౌందర్యాలు గుర్తింపుకి నోచుకోక మనసు మేలిముసుగు మాటు దాక్కునుంటాయి. అటువంటి కొన్ని అద్భుత క్షణాల అంతరంగపు కేరింతలే కొన్ని మధురస్వరాల తీపి అలలు.

నిశ్శబ్దాన్ని మోస్తూ పరవశాన్ని కలవరించే వారందరికీ "ప్రేమలేఖ" దృశ్య మాలికవుతుంది. అంతర్లోకంలో కాంతులీనే చిరునవ్వుకి ప్రణయమే కారణమైతే, అందరి తరపునా నేనాలపించిన బృందగానం కొందరినైనా సేదతీర్చగలదని ఆశిస్తూ

- లక్ష్మీ రాధిక