-
-
నీ కోసం నువ్వు...
Nee Kosam Nuvvu
Author: Sreekrishna Kotha
Publisher: Kotha Sreekrishna
Pages: 160Language: Telugu
"ఈ పుస్తకం ఎంతో అద్భుతంగా, మరెంతో జనరంజకంగా ఉంది. మందులు కూడా అవసరం లేకుండా డిప్రెషన్ పోగొట్టే ఒక అద్భుతమైన ప్రక్రియ... ప్రముఖ మానసికవేత్త ఏరన్బెక్ రూపొందించిన కాగ్నెటివ్ థెరపీ. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు అలాంటి థెరపీని అందించడానికి వచ్చిందా అనిపిస్తుంది. ఇటువంటి పుస్తకాన్ని... ముఖ్యంగా ప్రజలకి ఎంతో ఉపయోగకారి అయినటువంటి మంచి నేస్తం, గురువులాంటి పుస్తకాన్ని అందించిన రచయిత శ్రీకృష్ణ ఎంతో అభినందనీయుడు."
- డా. కర్రి రామారెడ్డి
"ఈ పుస్తకం కొందరికయినా మంచి భవిష్యత్తు కల్గించే సత్తా వున్న పుస్తకం. ఈ పుస్తకం కోసం రచయిత పడ్డ శ్రమ, పరిశీలన, తులనాత్మకత, వెచ్చించిన సమయం అన్నీ విలువైనవి, అవసరమైనవి. మంచి రచన! మంచి పుస్తకం!! మంచి విషయాలపై మంచి పుస్తకాలు రావటం లేదనుకొనే తరుణంలో ఆ లోటుని భర్తీ చేయడానికి వచ్చిన మంచి పుస్తకం."
- ఖాదర్ ఖాన్
"దృశ్య, శ్రవణ మాధ్యమాల ఒత్తిడిలో మునిగి తేలుతున్న సగటు పాఠకుడిని, మంత్రముగ్ధుడిని చేసి చివరిదాకా అత్యంత ఆసక్తితో చదివించి, మరల మరల చదవడానికి ఆసక్తి కల్పించి, అపుడే పుస్తకం పూర్తి అయినదా! అని అనిపిస్తుంది. చాలా ప్రభావంతమైన పుస్తకం."
- డా. చెక్కా మార్కండేయ గుప్త
"పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటుగా, పర్సనల్ డెవలప్‌మెంట్‌నీ లోతుగా టచ్ చేసిన పుస్తకమిది. ఈ రచనలో సగటు మధ్యతరగతి వ్యక్తి జీవితం వుంది. తరచి చూస్తే సమాజంలోని అన్ని వర్గాల వారు, అన్ని వయస్సుల వారు, వారికి తెలిసీ చేసే తప్పుల్ని నిర్మొహమాటంగా ఖండిస్తుంది. ఇలాంటి ప్రభావవంతమైన పుస్తకాన్ని మరింతగా ప్రజలకు దగ్గర చేయాలి."
- వై. శ్రీనివాసరావు
"ప్రపంచంలో అత్యంత కష్టతరమైన అంశం 'తన గురించి తాను తెలుసుకోవటం'. కోట్లాది మనస్తత్వాలు ఉన్న ఈ సమాజంలో వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని వేరుచేసి విభిన్న కోణాలలో ఒకదానితో ఒకటి ప్రశ్నింపచేయడం మరింత కష్టతరం. ఇది ఒక ఇతివృత్తంగా ఎంపిక చేసుకొని పరిశోధించి అక్షర సంకలనం చేయడం మరింత సాహసం. ఈ సాహస ప్రక్రియను అభినందిస్తున్నాను."
- డా. జె. సనత్‌కుమార్
