-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
నీ జతగా నేనుండాలి (free)
Nee Jataga Nenundali - free
Author: Mala Kumar
Publisher: Self Published on Kinige
Pages: 128Language: Telugu
నాకు ఉమ్మ డి కుటుంబాలంటే ఇష్టం. పిల్లలు, బామ్మ/అమ్మమ్మ , తాతయ్యలు, బాబాయిలు, పిన్నులు, అత్తయ్యలు, మామయ్యలు ఇలా అందరిలో పెరుగితే, నలుగురిలో కలవటము, నలుగురితో మంచి అని పించుకోవటము, అభిమానాలూ, ఆప్యాయతలూ తెలుస్తాయి. ఏ పరిస్థితినైనా ఎదుర్కునే బాలన్స్ వస్తుంది. తనకు అండగా కుటుంబసభ్యులు ఉన్నారు అనే భరోసా ఉంటుంది అని నా అభిప్రాయం.
నాకు చిన్న వయస్సులోనే పెళ్ళై మిలిటరీ వాతావరణంలోకి వెళ్ళటముతో, అక్కడ మిలిటరీ వాళ్ళ క్రమశిక్షణ, ఎట్టి పరిస్థితులలోనైనా బాలెన్స్ కోల్పోకుండా నిర్ణయాలు తీసుకోవటము, ఎదుటివారికి సహాయపడటములో ముందుండటము, సామాజిక నిబంధనలకు కట్టుబడి ఉండటమూ, వారే కాకుండా వారి భార్యలు కూడా అన్నిటిలోనూ మందుండటమూ, యుద్థవాతావరణంలో కూడా స్థిరంగా ఉండటమూ నా మనస్సులో నాటకుపోయాయి. డిఫెన్స్ వారంటే ఆరాధనాభావం ఏర్పడింది.
నాకు ఇష్టమైనా సబ్జెక్టులు, మాత్స్ , సైకాలాజీ. ఆంధ్రజ్యోతి పేపర్లో ఒకప్పుడు మనసులో మాట అని కొంతమంది వారి సమస్యలన్ని సైక్యార్టిస్టులకు చెబుతుండేవారు. అవీ, ఇంకా వివిధ పత్రికలల్లోని సైక్యార్టిస్టు ఆర్టికల్స్ ఇష్టంగా చదువుతాను.
వీటన్నిటి ప్రతిరూపమే నా ఈ "కథామాల".
