-
-
నీ బాంచను కాల్మొక్తా
Nee Banchanu Kalmokkta
Author: Illindala Saraswati Devi
Language: Telugu
ఈ నవల ఆంధ్రప్రభ ఆదివారపు సంచికలో సీరియల్‌గా వెలువడుతున్న కాలములో పాఠకులనేకులు ''ఈ నవలకీ పేరు బాగుండలేదని'' కొందరు, ''పేరు మా కర్థంకావటం లేదని'' కొందరు ఉత్తరాలు రాశారు. ''బాబూ'' ''నాయనా'' ''తండ్రీ'' అని ఆంధ్రదేశంలో కొన్ని ప్రాంతాలలో పిల్లలతో బ్రతిమిలాడే ధోరణిలో పెద్దవాళ్ళు అంటారు. అలాగే బానిసలూ ప్రభువులూ మెలగే ఈ సంఘంలో ''చిత్తం బాబయ్య'' అని కొన్ని ప్రాంతాలలో వాడుకలో ఉన్నట్టే తెలంగాణాలో ''నీ బాంచను కాల్మొక్తా'' అని వాడుకలో ఉన్నది. తెలంగాణా మాట మరింత బానిసత్వాన్ని సూచించేదిగానూ, కులాలలో తరతమ భేదాన్ని కొట్టవచ్చేటట్టు తెలిపేదిగానూ ఉన్నది. ఈ నవలకు ఇంతకంటే మంచి పేరు నాకు స్ఫురించలేదు.
ఈ నవలలో కథానాయకుడు హీనకులజుడని అతని పట్ల సంఘం ప్రవర్తించిన తీరూ, అతనిలో జీర్ణించుకుని పోయిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సును పోగొట్టటానికి జానకమ్మ చేసిన ప్రయత్నాలూ-అవి ఫలించిన తీరూ నా శక్తి కొద్దీ చిత్రీకరించటానికి ప్రయత్నం చేశాను.
ఈ సుదీర్ఘమైన నవలను ఒక సంవత్సరం పాటు ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో ధారావాహికంగా ప్రచురించిన ఆంధ్రప్రభ సంపాదకులకూ ఈ నవలలోని జానకమ్మ, కాశీరామ్ పాత్రల పట్ల ఎనలేని ఆదరాభిమానాలు పెంచుకున్న పాఠకలోకానికీ నా హృదయ పూర్వకమైన కృతజ్ఞతలు.
- ఇల్లిందల సరస్వతీదేవి
ఫిబ్రవరి, 1976.

- ₹162
- ₹96
- ₹108
- ₹96
- ₹162
- ₹72