• Nee Adugulalo Naa Gnapakalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నీ అడుగులలో... నా ఙ్ఞాపకాలు...

    Nee Adugulalo Naa Gnapakalu

    Author:

    Pages: 78
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


సృష్టి మొదలై యుగాలవరకూ సాగిపోతున్న ఈ జీవనగమనంలో "ప్రేమ" నిరంతర సాహిత్యసంపదగా ఫరిఢవిల్లుతూనేవుంది.
దానికి పరిధి లేదు, అంతరాలు లేవు, సంధర్భం లేదు, సమయభావన అస్సలుండదు. కానీ....
తెలియదనుకొనీ తెలిసినట్లూ..
వద్దనుకొనీ కావాలనుకున్నట్లూ..
ఆంతర్యానికే సమాధానం చెప్పుకోలేని భావనాపరంపరను మన హృదయాలలో నింపేసేది ప్రేమ.
అంత అపురూపమైన సంపదను మనకందించే మనసుని సృష్టించి ఇచ్చిన భగవంతునికి మనం ఏమిచ్చి రుణం తేర్చుకోగలం? మరి.... ఈ ప్రేమ పేరుతో ఇప్పుడు సాగుతున్న దాష్టికాలకు ఏదో విధంగా కారణాభూతులం అవుతూ., ఆ దేవుని దయను మనం నాశనం చేసుకోవటం లేదూ?

బ్రతకటం భౌతికత్వం
జీవించడం అభౌతికత్వం
ఈ రెండిటి కలయికే మానవజీవితానికి పరమార్ధం. చదువు, కీర్తీ, డబ్బూ,ఉద్యోగం ఇవన్నీ కావాలి బ్రతకడానికి. వాటితో పాటూ ప్రేమ కావాలి జీవించడానికి. బ్రతకటం మాత్రం తెలుసుకుంటే, నువ్వు నీచుట్టు పక్కల అందరికీ సమాధానం చెప్పగలవు. కానీ జీవించడం కుడా నేర్చుకుంటేనే.. నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలవ్. అప్పుడే సంపూర్ణ మానవుడివవుతావు. ఆత్మసాక్షిలేని గమనం జనాభాలెక్కలకే పనికొస్తుంది.
అందుకే ఈరోజున అర్ధమే మారిపోయిన ప్రేమ గురించి నేను చేసిన పరిశోధనా పత్రం ఇది. నన్ను నేను అర్పించుకున్న ప్రేమ నాకు అందించిన మనఃసాక్షి ఈ నాలుగు అధ్యాయాలు.
ఇది ప్రేమించాలనుకొనేవారికి ప్రేమ సన్నిధిని చూపెడుతుంది.
ఇది ప్రేమలోని వియోగం అందించే కన్నీటి బరువునూ చూపెడుతుంది.
ఇది ప్రేమవియోగపు అనియంత్రిత ఖేదం చూపెడుతుంది.
ఇది ప్రేమవియోగపు అనియంత్రిత ఖేదం నుండి మనిషిగా మనం సాధించాల్సిన మోక్షం ని తెలుపుతుంది. సంపూర్ణమయిన ఒక మానసిక ఆనందాన్ని అసంపూర్ణంగా మార్చుకుంటూ.. మానవత్వపు పాశాన్ని హింసకూ, ఉన్మాదానికీ బలిచేస్తున్న, చేయాలనుకుంటున్న వారందరూ ఈ నా "నీ అడుగులలో నా ఙ్ఞాపకాలు చదవండి. ఇది అలాంటి స్థితిలోనుంచే నన్నూ బయటకు తెచ్చి కాపాడింది. కత్తి తీయడానికీ.. తెగనరకడానికీ మధ్యన.. ఆ పోటును భరించబోయే ప్రాణం యొక్క ఆఖరి చూపుల్ని మీవిగా గుర్తుకుతెచ్చుకోండి. అందుకు కావలసింది మీలో దాగివున్న నిజమైన ప్రేమ ఙ్ఞాపకాలే. అదే నా అనుభవం. అందుకోసమే నేనీ పుస్తకం మీ ముందుకు తెచ్చాను. ఇది నా మిగిలివున్న జీవితాన్ని విలువైనదిగా నాకు అందించింది.
అన్నిటినీ మించి "ప్రేమ మనలో నిజంగా నిక్షిప్తమయితే.. ఇక ఈ విశ్వంలో మనంత విజేత ఎవరుంటారు? అది కాక... నిన్ను ఓడించే ఇంకేదీ ప్రేమ కాదు. దాని కోసం నీ జీవితాన్ని బలివ్వకు. నీలో ప్రేమ నిజమైనదే అయితే..దాన్ని అందుకోవటానికి ఈ ప్రపంచంలో ఆర్తి తీరని హృదయాలూ, ఆకలికడుపులూ కొన్ని కోట్లున్నాయి.వాటికి నువ్వు కావాలని తెలుసుకో. నువ్వే గొప్పవాడివనిపిస్తావు" అని చెప్పిన నా అంతరాత్మ మాటలే నన్ను ఇప్పుడు నడిపించాయి.
అందుకే ఈ రచనని ఎంతో ప్రేమతో రాసాను. మొదలుపెట్టాక మాత్రం పూర్తిగా చదవండి.

- శ్రీఅరుణం

Preview download free pdf of this Telugu book is available at Nee Adugulalo Naa Gnapakalu