• Nayakudu Kathanayakudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    78
    7.69% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • నాయకుడు - కథానాయకుడు

    Nayakudu Kathanayakudu

    Author:

    Pages: 92
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'దాన వీర శూర కర్ణ' ప్రివ్యూ చూసిన మర్నాటి తెల్లవారు జామునే ఎన్‌.టి.ఆర్‌. ఇంటికి వెళ్ళాను. 'ఎలా ఉంది' అని అడిగారాయన. 'అక్బర్‌గా పృథ్వీరాజ్‌కపూర్‌, జులియస్‌ సీజర్‌గా రెక్స్‌హారిసన్‌, రారాజుగా మీరు - బహుశా ఆ వ్యక్తులు ఇలాగే ఉండేవారేమో అన్నంతగా మూర్తిదిద్దారు' అన్నాను. జీవితమంతా రాజరాజు వ్యక్తిత్వంతో తిరుగులేని కళామూర్తిగా నిలిచిన ఎన్‌.టి.ఆర్‌. ఇవాళ చరిత్ర.

రెండు మూడు జీవితకాలాల్లో సాధించగల ఆపూర్వ విజయాలని, ఇటు కళారంగానికి – దానితో ఏమాత్రమూ పొంతనలేని రాజకీయ రంగానికి - అనూహ్యమైన వారధిని నిర్మించి సవ్యసాచి అనిపించుకున్నారు ఎన్‌.టి.ఆర్‌. 'మద్రాసీ'గానే పరాయి రాష్ట్రాలకూ, దేశాలకు చెల్లుబడి ఆయ్యే ఆంధ్ర తేజానికి తనదైన గుర్తింపును కల్పించిన వీరుడు.

షూటింగ్‌లో ఆయన్ని పాము కరిస్తే భయభ్రాంతుడయి నిర్మాత స్పృహ తప్పిపోయాడు గాని, పలకరించడానికి వెళ్ళిన మమ్మల్ని నవ్వుతూ పలకరించి, నిర్ఘాంతపోయేట్లు చేశారు. తన సంకల్పబలంతో మృత్యువుని చాలాసార్లు జయించిన వ్యక్తి. జీవితంలో పదేపదే తనని తానే జయించుకుంటూ, కొత్త రికార్డులు స్థాపించిన వ్యక్తి. రోజుకి 18-20 గంటలు పనిచేసి 74 సంవత్సరాలలోనే నూరేళ్ళ జీవితాన్ని పొదిగిన వ్యక్తి. చిరంజీవత్వం కాలాన్ని పొడగించంలో కాదనీ, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఉన్నదని తాను బతికి నిరూపించిన వ్యక్తి.

- గొల్లపూడి మారుతీరావు

Preview download free pdf of this Telugu book is available at Nayakudu Kathanayakudu